ఐపీఎల్ 2022 (IPL 2022) మెగా ఆక్షన్ (Mega Auction) కోసం బీసీసీఐ (BCCI) రంగం సిద్దం చేస్తున్నది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ మెగా ఆక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ ప్లేయర్ రిటెన్షన్ పాలసీని (Player Retention Policy) ప్రకటించింది. దీనిని బేస్ చేసుకొని అన్ని ఫ్రాంచైజీలు ఎవరెవరిని తమ జట్టులో ఉంచుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నాయి. స్వదేశీ ప్లేయర్లను ముగ్గురి కంటే ఎక్కువ తీసుకునే వీలు లేదు. ఒక వేళ విదేశీ ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే ఒకరిద్దరి కంటే ఎక్కువ మందికి అవకాశం లేదు. దీంతో అన్ని ఫ్రాంచైజీలు తమ కీలకమైన ఆటగాళ్లను వదులుకోవల్సి వస్తున్నది. అయితే కొన్ని ఫ్రాంచైజీలు కీ ప్లేయర్లను వదిలేసినా.. వారిని తిరిగి వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఫ్రాంచైజీ ఇద్దరు టీమ్ ఇండియా (Team India) ప్లేయర్లను వదిలేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్‌తో (Sreyas Iyer) పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లను (Ravichandran Ashwin) ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్‌లో పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు స్వదేశీ, ఒక విదేశీ ప్లేయర్‌ను అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు అతడు చెప్పాడు. 'నన్ను రిటైన్ చేసుకోవాలని అనుకుంటే ఇప్పటికే సమాచారం అందేది. కానీ ఇంత వరకు అటువైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆ జట్టు నన్ను విడుదల చేస్తుంది. నేనే కాదు శ్రేయస్ అయ్యర్‌ను కూడా రిటైస్ చేసుకోవట్లేదని తెలుస్తున్నది' అని అశ్విన్ తన యూట్యూబ్ చానల్‌లో పేర్కొన్నాడు.
In a continuation from the last episode, @ashwinravi99 ropes in analyst @gaurav_sundar to discuss possible auction retentions by all teams. Does their prediction match yours? Here's a sneak peek. Show release today evening. Stay tuned. pic.twitter.com/LYe6l7qzlR
— Crikipidea (@crikipidea) November 22, 2021
రవిచంద్రన్ అశ్విన్ గతంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే 2020 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 7.6 కోట్లకు కొనుగోలు చేసింది. 2020, 2021 సీజన్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. దీంతో ఏకంగా నాలుగేళ్ల తర్వాత టీమ్ ఇండియా టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. అయితే ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, పృథ్వీషా, ఎన్రిక్ నోర్జేలను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నది. వీరి ముగ్గురిని రిటైన్ చేసుకోవడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ పర్స్ వాల్యూ రూ. 90 కోట్ల నుంచి రూ. 42 కోట్లు కట్ అయిపోతాయి. ఇక మిగిలిన రూ. 48 కోట్ల తోనే ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు రవిచంద్రన్ అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సారి కొత్త క్రికెటర్ల ఎంపిక భారమంతా ఎంఎస్ ధోనీపైనే ఉండబోతున్నది. రాబోయే సీజన్‌లో ధోనీ ఆడినా ఆడక పోయినా సీఎస్కే వ్యవహారాల్లో అతడు కీలకంగా వ్యవహరించనున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడవచ్చని తెలుస్తున్నది. అతడు ఏ జట్టులోకి వెళ్లినా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL, IPL 2022, Ravichandran Ashwin, Shreyas Iyer