• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RAVICHANDRAN ASHWIN ALONG WITH JOE ROOT AND KYLE MAYERS WERE NOMINATED FOR THE ICC PLAYER OF THE MONTH SRD

ICC : ఐసీసీ అవార్డు రేసులో అశ్విన్..పోటీలో మరో ఇద్దరు..ఫ్యాన్సే న్యాయ నిర్ణేతలు...

ICC : ఐసీసీ అవార్డు రేసులో అశ్విన్..పోటీలో మరో ఇద్దరు..ఫ్యాన్సే న్యాయ నిర్ణేతలు...

రవిచంద్రన్ అశ్విన్

ICC : అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా "ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌" అవార్డును ఇవ్వాలని ఐసీసీ జనవరిలో నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించేందుకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు తెలిపింది.

  • Share this:
    అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా "ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌" అవార్డును ఇవ్వాలని ఐసీసీ జనవరిలో నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించేందుకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు తెలిపింది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి "ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌" అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లను నామినేట్‌ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. అందులో టీమిండియా నుంచి ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, విండీస్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ ఉన్నారు. ఐసీసీ వెబ్‌సైట్‌ ద్వారా అభిమానులు తమకు నచ్చిన ఆటగాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఓటింగ్‌ ఆధారంగా మార్చి 8న అవార్డు ఎవరికి వరిస్తుందో తేలనుంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా తరపున ఇంగ్లండ్‌ సిరీస్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి, టీమిండియాకు సూపర్ విక్టరీ అందించాడు. ఆ టెస్టులో అశ్విన్‌ 106 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లోనూ 8 వికెట్లతో రాణించాడు. అంతేగాక మొతేరా వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో 400 వికెట్ల ఫీట్‌ను అందుకోవడమేగాక ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక రూట్‌ విషయానికి వస్తే.. టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో మెరిసి ఇంగ్లండ్‌ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.

    వీరిద్దరిని పక్కనపెడితే.. విండీస్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌  కూడా పోటీలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మేయర్స్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీతో(210 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. ఈ ఫీట్‌ను మేయర్స్‌ మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో అందుకోవడం విశేషం. అంతేగాక అతని ఇన్నింగ్స్‌తో విండీస్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో 5వ అత్యధిక స్కోరును చేధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.




    మరోవైపు మహిళా క్రికెటర్ల జాబితాలో టామీ బ్యూమాంట్​(ఇంగ్లండ్​), బ్రూక్ హాలిడే(ఆస్ట్రేలియా), నాట్ సైవర్(ఇంగ్లండ్​) 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'కు పోటీ పడుతున్నారు. టామీ బ్యూమాంట్ న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ 231 రన్స్ చేయగా.. న్యూజిలాండ్‌కు చెందిన బ్రూక్ హాలిడే 110 పరుగులతో పాటు 2 వికెట్లు తీసింది. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సైవర్ 5 వికెట్లతో పాటు 96 పరుగులు చేసింది.
    జనవరిలో నెలలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని ఈ అవార్డు వరించింది. జనవరి నెలలోనూ నామినేషన్స్‌లో నిలిచిన జో రూట్.. వరుసగా రెండో నెలలో పోటీలో ఉండటం గమనార్హం.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు