టీమిండియా కోచ్ రవిశాస్త్రికి బంపర్ బొనాంజా ఆఫర్...భారీగా పెరిగిన వేతనం...?

కొత్త కాంట్రాక్టులో భాగంగా పెరిగిన వేతనంతో రవిశాస్త్రి ఏటా రూ.10 కోట్లు అందుకోనున్నాడు. రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల వార్షిక వేతనం కూడా భారీ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: September 9, 2019, 5:51 PM IST
టీమిండియా కోచ్ రవిశాస్త్రికి బంపర్ బొనాంజా ఆఫర్...భారీగా పెరిగిన వేతనం...?
రవిశాస్త్రి (ఫైల్ చిత్రం)
  • Share this:
టీమిండియా ప్రధాన కోచ్‌ బాధ్యతల్లో కొనసాగుతున్న రవిశాస్త్రికి బీసీసీఐ బంపర్ సాలరీ ప్యాకేజీని ప్రకటించింది. కొత్త కోచ్ అంటూ బీసీసీఐ హడావిడి చేసినప్పటికీ మళ్లీ రవిశాస్త్రికే ప్రధాన కోచ్ పగ్గాలు అప్పగించడంతో సమస్య తీరిపోయింది. కపిల్ దేవ్ నేతృత్వంలో ఏర్పాటైన సెర్చ్ ప్యానెల్ మరోసారి రవిశాస్త్రికే పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అత్యంత ప్రీతిపాత్రుడిగా పేరొందిన రవిశాస్త్రి  ప్రధాన కోచ్ బాధ్యతల్లో 2021 నవంబర్ దాకా కొనసాగనున్నాడు. ఇదిలా ఉంటే రవిశాస్త్రికి కొత్త కాంట్రాక్టులో భారీ వేతనం ముట్టనుందని క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రధాన కోచ్ పదవిలో ఉన్న రవిశాస్త్రికి సాలీనా రూ.8 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. అయితే ఈ సారి మాత్రం రవి శాస్త్రి వేతనం మరో రెండు కోట్లు పెంచినట్లు సమాచారం.

కొత్త కాంట్రాక్టులో భాగంగా పెరిగిన వేతనంతో రవిశాస్త్రి ఏటా రూ.10 కోట్లు అందుకోనున్నాడు. రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల వార్షిక వేతనం కూడా భారీ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.
Published by: Krishna Adithya
First published: September 9, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading