Home /News /sports /

RAVI SHASTRI REVEALED SOME PEOPLE IN BCCI MADE EVERY EFFORT THAT I COULD NOT BECOME THE HEAD COACH OF INDIAN CRICKET TEAM JNK

Ravi Shastri: 'నేను టీమ్ ఇండియా కోచ్ అవొద్దని కొంత మంది తీవ్రంగా ప్రయత్నించారు'.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

కోచ్ పదవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన రవిశాస్త్రి (BCCI)

కోచ్ పదవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన రవిశాస్త్రి (BCCI)

Ravi Shastri: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రెండో పర్యాయం తాను పదవీ బాధ్యతలు చేపట్టకూడదని బీసీసీఐలో ఒకరు కోరుకున్నట్లు రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో నాతో విభేదించి ఏకంగా నన్నే తీసేయాలని ఆ వ్యక్తి ప్రయత్నించినట్లు శాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియాలో (Team India) ఇప్పుడు మార్పుల పర్వం నడుస్తున్నది. టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup) తర్వాత భారత జట్టులో కీలకమైన మార్పులు సంభవించాయి. హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి (Ravi Shastri) మెగా ఈవెంట్ తర్వాత గుడ్ బై చెప్పాడు. దీంతో అతడి స్థానంలో ఎన్ఏసీ చీఫ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటికే స్వదేశంలో టీ20, టెస్టు సిరీస్‌లలో రాహుల్ ద్రవిడ్ తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ (Virat Kohli) స్వచ్ఛందంగా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం అనవసరం అని భావించిన సెలెక్టర్లు వన్డేలకు కూడా రోహిత్ శర్మనే (Rohit Sharma) కెప్టెన్‌గా నియమించారు. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు అనుసరిస్తున్న పద్దతిలోనే రెడ్ బాల్ క్రికెట్‌కు కోహ్లీ, వైట్ బాల్ క్రికెట్‌కు రోహిత్‌లను వేర్వేరుగా కెప్టెన్లను నియమించారు. ఇక తాజాగ మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.

    నేను టీమ్ ఇండియాకు రెండు పర్యాయాలు హెడ్ కోచ్‌గా ఉన్నాను. తొలి సారి సాఫీగానే సాగినా.. రెండో సారి నేను కోచ్‌గా ఉండటం కొంత మంది వ్యక్తులకు ఇష్టం లేదు. ముఖ్యంగా ఒక వ్యక్తికి నా సపోర్టింగ్ స్టాఫ్ భరత్ అరుణ్‌ను ఎంచుకోవడం ఇష్టం లేదు. అందుకే నన్ను కోచ్‌గా తీసేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ నేను నా బాధ్యతలకు కట్టుబడి ఉండి మంచి ఫలితాలు సాధించాను. కానీ బౌలింగ్ కోచ్ ఎంత మంచి ఫలితాలు సాధించాడొ అందరికీ తెలిసిన విషయమే అని రవిశాస్త్రి అన్నాడు. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. అందరూ మనకు అనుకూలమైన వ్యక్తులే ఉండరు అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

    Sourav Ganguly: ఆ రోజు కోహ్లీని చాలా బతిమిలాడాము.. కానీ వినిపించుకోలేదు.. అసలు విషయం చెప్పిన సౌరవ్ గంగూలీ




    రవిశాస్త్రి - విరాట్ కోహ్లీ హయాంలో భారత జట్టు చాలా అభివృద్ది చెందింది. దూకుడైన ఆటకు మారు పేరుగా నిలిచింది. అయితే మూడు ఫార్మాట్లలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయిందనే మచ్చ మాత్రం మిగిలిపోయింది. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై రెండు సార్లు విజయం సాధించింది. ఇవే కాకుండా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై భారత జట్టు అజేయంగా నిలిచింది. అతని హయాంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్‌లలో టీ20 సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. గత నాలుగేళ్లలో భారత్ బెంచ్ బలం కూడా చాలా రెట్లు పెరిగింది.

    Google Search: ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో ఐపీఎల్‌దే అగ్రస్థానం.. టాప్ 10 సెర్చ్‌లలో ఏమున్నాయంటే..!


    రవిశాస్త్రి హయాంలో టీమ్ ఇండియా మొత్తం 43 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 25 గెలిచి 13 ఓడింది. 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. వన్డేలలో 79 మ్యాచ్‌లు ఆడింది. అందులో 53 గెలిచి 23 ఓడింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, ఒకటి అసంపూర్తిగా నిలిచింది. టీ20 గురించి చెప్పాలంటే 68 మ్యాచ్‌లు ఆడిన భారత్ 44 గెలిచి 20లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌లు టై కాగా, రెండు అసంపూర్తిగా ఉన్నాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, Cricket, Ravi Shastri, Team india

    తదుపరి వార్తలు