• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RAVI SHASTRI KEY ROLE INZAMAM UL HAQ ON INDIAS BORDER GAVASKAR TROPHY TRIUMPH GH SA

Border-Gavaskar Trophy: భారత్ విజయంలో రవిశాస్త్రిదే కీలక పాత్ర: పాక్ మాజీ క్రికెటర్

Border-Gavaskar Trophy:  భారత్ విజయంలో రవిశాస్త్రిదే కీలక పాత్ర: పాక్ మాజీ క్రికెటర్

team india aus vs ind

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడంలో యువ ఆటగాళ్లతో పాటు కోచ్ రవిశాస్త్రి పాత్ర కూడా ఎంతో ఉందటున్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్‌ ఉల్ హక్

  • Share this:
    ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్లు ప్రదర్శనను మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడంలో యువ ఆటగాళ్లతో పాటు కోచ్ రవిశాస్త్రి పాత్ర కూడా ఎంతో ఉందటున్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్‌ ఉల్ హక్. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి యంగ్ ప్లేయర్లను ఎంతగానో ప్రోత్సహించాడని చెప్పాడు. వారిపై నమ్మకం ఉంచడం వల్లే స్వేచ్ఛగా ఆడి గబ్బాలో విజయం సాధించారని తెలిపాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత జట్టు వరుసగా రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. గబ్బాలో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో మన వాళ్ల ఆటకు మాజీలు ఫిదా అవుతున్నారు. గబ్బాలో ఆసీస్‌కు 32 సంవత్సరాలుగా ఓటమే లేదు. అలాంటిది వారిని ఊహించని విధంగా ఎదుర్కొన్న యువ ఆటగాళ్లు, కంగారూలకు ఓటమి రుచి చూపించారు.

    భారత్‌ విజయాన్ని ఇంజమామ్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో ఆట గురించి విశ్లేషించాడు. ఈ గెలుపులో కోచ్ రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. "రవిశాస్త్రి టీమ్ ఇండియా డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రధాన కోచ్‌గా ఎదిగాడు. అతడి అనుభవం, గేమ్ ప్లానింగ్ యువ ఆటగాళ్లకు ఉపయోగపడింది. సిరీస్ విజయంలో అతడి పాత్ర ఎంతో ఉంది. భారత్‌ తరఫున ఆడిన గొప్ప ప్లేయర్లలో రవి ఒకడు. అతడు ఒక అద్భుతమైన ఆల్ రౌండర్. రవిశాస్త్రి కామెంట్రీ చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. కామెంట్రీలో అతడు చెప్పే విషయాలు తన ప్రతిభను గుర్తు చేసేవి. ఆటపై రవికి ఎంతో నాలెడ్జ్ ఉంది. అదే ఇప్పుడు భారత జట్టుకు చాలా సహాయపడిందని నేను నమ్ముతున్నాను. అడిలైడ్‌లో ఓటమిపాలైనా జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూసుకున్నాడు” అని ఇంజామామ్ వివరించాడు.

    * సొంత రాష్ట్రాలకు ఆటగాళ్లు

    బ్రిస్బేన్ నుంచి టీమ్ ఇండియా జనవరి 21న భారత్‌కు తిరిగి వచ్చింది. ఆసీస్‌లో చారిత్రక విజయం సాధించిన ప్లేయర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్‌ ముంబైకి వచ్చారు. మిగిలిన ఆటగాళ్లు గురువారం తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో సిరాజ్‌ను, తమిళనాడులో నటరాజన్‌ను అభిమానులు సన్మానించారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు