RAVI SHASTRI COMMENTS IGNORING RANJI TROPHY MEANS PLAYING CRICKET WITHOUT A BACKBONE EVK
Ravi Shastri: విస్మరించడం అంటే.. క్రికెట్‌కు వెన్నుముక లేకుండా చేయడమే!
Ravi Shastri
Ravi Shastri | చివరి రంజీ ట్రోఫీ 2020లో జరిగింది, సౌరాష్ట్ర ఫైనల్లో బెంగాల్‌ను ఓడించి వారి మొట్టమొదటి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అప్పటి నుంచి ఇండియాలో దేశీయ టోర్నమెంట్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దు చేశారు. దీనిపై భారతమాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
చివరి రంజీ ట్రోఫీ 2020లో జరిగింది, సౌరాష్ట్ర ఫైనల్లో బెంగాల్ (Bengal) ను ఓడించి వారి మొట్టమొదటి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అప్పటి నుంచి ఇండియాలో దేశీయ టోర్నమెంట్ కోవిడ్-19 (Covid 19) మహమ్మారి కారణంగా రద్దు చేశారు. పలు సార్లు వాయిదా వేశారు. అన్ని ఇతర ఫ్రాంచైజీ టోర్నమెంట్లు, అంతర్జాతీయ పోటీలు యధావిధిగా జరుగుతున్నాయి. దీనిపై భారత మాజీ ప్రధాన కోచ్, రవిశాస్త్రి (Ravi Shastri) స్పందించారు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) కి తన మద్దతునిచ్చేందుకు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో క్రికెట్‌కు రంజీ ప్రధాన వెన్నెముక అని, దేశవాళీ ప్రధాన పోటీని విస్మరించడం దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
'రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌కు వెన్నెముక. మీరు దానిని విస్మరించడం ప్రారంభించిన క్షణంలో మా క్రికెట్ వెన్నుముక లేకుండా పోతుంది!'' అని శాస్త్రి ట్వీట్ చేశాడు. శాస్త్రి వ్యాఖ్యానించిన ఒక గంట తర్వాత, BCCI కార్యదర్శి జే షా ఒక ప్రకటన విడుదల చేశారు.
టోర్నమెంట్ దశలవారీ పునఃప్రారంభాన్ని ధ్రువీకరించింది. “ఈ సీజన్లో రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి దశలో, జూన్‌లో నాకౌట్లు జరుగనుండగా, లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లను పూర్తి చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము, ”అని షా ఒక ప్రకటనలో తెలిపారు.
అంతే కాకుండా ఇటీవల విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడంపై కూడా రవిశాస్త్రి స్పందించారు. కెప్టెన్సీ నుంచి వైదొలగడం అతని నిర్ణయమని..ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉందన్నాడు రవిశాస్త్రి (Ravi shastri). కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా..కోహ్లీ ఆటతీరులో పెద్ద తేడా ఉండదని రవిశాస్త్రి చెప్పాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఇండియా పరాజయం పాలయినంత మాత్రాన ఐదేళ్లుగా నెంబర్ 1 గా ఉన్న టీమ్..ఒక్కసారిగా పడిపోయిందని చెప్పడం మంచిది కాదన్నాడు. ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇక, ఓ ఆటగాడి సామర్థ్యాన్ని అతని ఆటను బట్టి లెక్కించాలి గానీ, ప్రపంచకప్‌లతో కాదన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆరు ప్రపంచకప్‌ల తర్వాత మెగా టోర్నీ టైటిల్ అందుకున్నాడని, భారత దిగ్గజ క్రికెటర్లుగా చెప్పుకునే సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అసలు ప్రపంచకప్‌లే గెలవలేదన్నాడు. అంతమాత్రాన వాళ్లు చెత్త ఆటగాళ్లు అవుతారా? అని ప్రశ్నించాడు. టీమిండియా తరఫున ప్రపంచకప్ గెలిచిన సారథులు ఇద్దరే ఉన్నారని గుర్తు చేశాడు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.