• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RAVI SHASTRI BELIEVES IPL 2020 COULD DECIDE MS DHONI TEAM INDIA FUTURE MK

టీ 20 వరల్డ్ కప్‌ జట్టులో ధోనీకి స్థానం కల్పించే చాన్స్...కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు...

టీ 20 వరల్డ్ కప్‌ జట్టులో ధోనీకి స్థానం కల్పించే చాన్స్...కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు...

ధోనీ. రవిశాస్త్రి

ఐపీఎల్‌లో ధోనీ పెర్ఫార్మన్స్ చూసి టీ 20 వరల్డ్‌ కప్‌ కోసం తుది జట్టును ప్రకటిస్తామని రవిశాస్త్రి తెలిపారు. డిసెంబర్‌లో జరగబోయే టీ 20 వరల్డ్‌ కప్‌ కోసం తుది జట్టు ఎంపికలో ధోనీ ఆడే అవకాశం ఉందని రవిశాస్త్రి పరోక్షంగా పేర్కొనడం విశేషం.

  • Share this:
    ధోనీ ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగడం లేదని కోచ్ రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ వార్తలు హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో ధోనీ పెర్ఫార్మన్స్ చూసి టీ 20 వరల్డ్‌ కప్‌ కోసం తుది జట్టును ప్రకటిస్తామని రవిశాస్త్రి తెలిపారు. డిసెంబర్‌లో జరగబోయే టీ 20 వరల్డ్‌ కప్‌ కోసం తుది జట్టు ఎంపికలో ధోనీ ఆడే అవకాశం ఉందని రవిశాస్త్రి పరోక్షంగా పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే వరల్డ్‌ కప్‌ తర్వాత ధోనీ టీమిండియా తరపున ఆడలేదు. ఈ నేపథ్యంలో ధోనీ త్వరలోనే రిటైర్మంట్ వార్తలు వచ్చాయి. ఇప్పట్లో ధోని రిటైర్మెంట్‌ ఉండకపోవచ్చునని స్పష్టంగా తెలుస్తోంది. 2021 ఐపీఎల్‌ వరకు తాను అందుబాటులో ఉంటానని చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే)కు ధోనీ తెలిపినట్లు సమాచారం.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు