Home /News /sports /

Neeraj Chopra: నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర అరుదైన బహుమతి.. ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ దక్కని గౌరవం

Neeraj Chopra: నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర అరుదైన బహుమతి.. ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ దక్కని గౌరవం

స్వర్ణ పతాక విజేత నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర అరుదైన బహుమతి (Twiiter)

స్వర్ణ పతాక విజేత నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర అరుదైన బహుమతి (Twiiter)

సరికొత్త రికార్డులు సృష్టించే క్రీడాకారులకు ఆనంద్ మహీంద్ర తన కంపెనీకి చెందిన కార్లను బహుమతిగా ఇస్తుంటారు. అలాగే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు కూడా బహుమతి ప్రకటించారు. కానీ అది మిగతా అథ్లెట్లకు ఇచ్చినట్లుగా కాదు..

    భారతీయుల వందేళ్ల స్వర్ణ పతకం (Gold Medal) కలను నిజం చేసిన హర్యాణా కుర్రాడు నీరజ్ చోప్రాకు (Neeraj Chopra) అభినందనలతో పాటు రివార్డుల వర్షం కూడా కురుస్తున్నది. సొంత రాష్ట్రం హర్యాణా ప్రభుత్వం అతడికి రూ. 6 కోట్ల రూపాయలు, పంజాబ్ ప్రభుత్వం రూ. 2 కోట్ల ప్రభుత్వం నగదు బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించాయి. బీసీసీఐ రూ. 1 కోటి, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 1 కోటి నజరానా ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఇక హర్యాణాకు చెందిన ఎలాన్ గ్రూప్ అనే వ్యాపార సంస్థ రూ. 25 లక్షలు ప్రకటించింది. ఇలా అన్ని వైపుల నుంచి బహుమతులు, రివార్డులు వస్తున్నాయి. అయితే అభిమానుల చూపు మాత్రం ఒకరి వైపే ఉన్నది. ఆయన ఆనంద్ మహీంద్ర (Anand Mahindra). క్రీడల్లో ఎవరైనా గొప్పగా సాధిస్తే తన మహీంద్రా కంపెనీకి చెందిన వాహనాలను బహుమతిగా ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉంటూ జవాబులు ఇస్తుంటారు. శనివారం నీరజ్ చోప్రా స్వర్ణం గెలవగానే ట్విట్టర్‌లో అనేక మంది ఆనంద్ మహీంద్ర ట్వీట్ కోసం ఎదురు చూశారు. ఒక వ్యక్తి ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ 'ఎక్స్‌యూవీ ఫర్ నీరజ్' (XUV 700 for Neeraj) అని ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే ఆనంద్ మహీంద్ర జవాబు ఇచ్చారు.

    రితేశ్ జైన్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు జవాబు ఇస్తూ ఆనంద్ మహీంద్ర తన కంపెనీ లోని ఇద్దరు ఉన్నతోద్యోగులను ట్యాగ్ చేస్తూ 'ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మన గోల్డెన్ అథ్లెట్‌ కోసం ఒక ఎక్స్‌యూవీ 700 సిద్దంగా ఉంచండి' అని ట్వీట్ చేశారు. అయితే దానికి మరో వ్యక్తి.. ఎందుకు నీరజ్‌కు 'ఒక ఎక్స్‌యూవీ' సిద్దంగా ఉంచడం.. అతడికి మొదటి ఎక్స్‌యూవీని అందించొచ్చు కదా అని ట్వీట్ చేశారు. వెంటనే ఆనంద్ మహీంద్ర.. 'మేము మీ మాట విన్నాము' అని జవాబు ఇచ్చారు. అంటే ఆనంద్ మహీంద్ర ట్వీట్‌ను బట్టి ఎక్స్‌యూవీ 700 మోడల్ మొదటి వెహికిల్‌ను నీరజ్ చోప్రా అందుకోబోతున్నాడు. మహీంద్ర కంపెనీ నుంచి వస్తున్న కొత్త ఎక్స్‌యూవీ 700 కారు అగస్టు నెలలోనే విడుదల కానున్నది. నీరజ్ కూడా బంగారు పతకం గెలవడంతో అతడికే మొదటి వెహికిల్ ఇవ్వాలని ఆనంద్ మహీంద్ర డిసైడ్ అయ్యారు.









    ఆనంద్ మహీంద్ర ఇప్పటి వరకు చాలా మందికి కార్లు బహుమతిగా ఇచ్చారు. రియో 2016 ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌లకు థార్ కార్లను బహుమతిగా ఇచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన టి. నటరాజన్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్‌లకు తలా ఒక థార్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. అయితే ఆ మోడల్ కార్లన్నీ అప్పటికే మార్కెట్లో విడుదలైన కార్లు. కానీ ఇప్పుడు నీరజ్‌కు ఇవ్వబోతున్న ఎక్స్‌యూవీ 700 మాత్రం మార్కెట్‌లోకి విడుదల కాకముందే మొదటి కారును అతడికి అందించనున్నారు. ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ దక్కని గౌరవం నీరజ్ పొందనున్నాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Anand mahindra, Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు