• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RAPE ACCUSITIONS ON FOOTBALL STAR CHRISTIANO RONALDO MODEL CLAIMS 570 CRORE RUPEES DAMAGE JNK

Football : రొనాల్డో రేప్ చేశాడు.. నాకు రూ. 579 కోట్ల పరిహారం ఇప్పించండి.. కోర్టుకెక్కిన మోడల్

Football : రొనాల్డో రేప్ చేశాడు.. నాకు రూ. 579 కోట్ల పరిహారం ఇప్పించండి.. కోర్టుకెక్కిన మోడల్

రొనాల్డోపై రేప్ ఆరోపణలు చేసిన మాజీ మోడల్

  • Share this:
    ఫుట్‌బాల్ (Football) స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై (Christiano Ronaldo) ఒక మోడల్ తీవ్ర ఆరోపణలు చేసింది. మాజీ మోడల్ కాథరిన్ మయోర్గా (Kathryn Mayorga) ఈ రేప్ ఆరోపణలు చేయడమే కాకుండా తనకు నష్టపరిహారం కింద 56 మిలియన్ పౌండ్లు (రూ. 579 కోట్లు) ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. గతంలో జరిగిన ఘటన వల్ల అనుభవించిన బాధకు, రాబోయే రోజుల్లో తాను అనుభవించాల్సిన భాధకు, మొత్తానికి తనకు జరిగిన అన్యాయానికి కలిపి రూ. 579 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నది. కాగా, ఆ మోడల్ అడిగిన మొత్తం రొనాల్డో జువెంటస్ క్లబ్‌కు ఆడితే రెండేళ్లకు వచ్చే జీతంతో సమానం కావడం గమనార్హం. 2009లో లాస్‌వెగాస్‌లోని ఒక నైట్ క్లబ్‌లో రొనాల్డో తనను కలిశాడని.. ఆ తర్వాత తన హోటల్ రూమ్‌కు తీసుకొని వెళ్లి అత్యాచారం చేసినట్లు మోడల్ కాథరిన్ ఆరోపించింది. కాగా, రొనాల్డో ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. నాపై వచ్చిన ఈ ఆరోపణలు మొత్తం నిరాధారమైనవని ఆయన అన్నారు. అయితే రేప్ అనేది ఎంత ఘోరమైన నేరమో నాకు తెలుసు. దాని వల్ల ఎంత బాధపడతారో తెలుసు కానీ నేను అలా చేయలేదు అని రొనాల్డో అంటున్నాడు.

    మయోర్గా 2010లోనే కోర్టు బయట 2,70,000 పౌండ్లకు సెటిల్‌మెంట్ చేసుకున్నదని రొనాల్డో చెబుతున్నాడు. ఆ రోజు ఇద్దరి పరస్పర సహకారంతో సరదాగా గడిపినా.. ఆమె తనపై అనవసరమైన ఆరోపణలు చేసి కోర్టును ఆశ్రయించిందని.. దాంతో పదేళ్ల కిందటే ఆమెతో సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు రొనాల్డో తెలిపాడు. అయితే 2017లో ఇదే కేసును తిరిగి తెరిపించిందని.. తాను అప్పుడు జరిగిన దాని నుంచి బయటపడలేకపోతున్నానని.. మానసికంగా కుంగిపోయానని చెప్పి కేథరిన్ మయోర్గా మళ్లీ కేసు వేసిందని రొనాల్డో అంటున్నారు. కాగా తనతో బలవంతంగా సెటిల్‌మెంట్ చేయించారని మయోర్గా ఆరోపిస్తున్నట్లు 'ది మిర్రర్' ఒక కథనాన్ని ప్రచురించింది. మయోర్గా లీగల్ టీమ్ దాదాపు 60 మంది సాక్ష్యులతో కూడిన లిస్టును తయారు చేసి.. వీరందరినీ కోర్టు లీగల్ విచారణ జరపాలని కోరుతున్నది. ఆ లిస్టులో బిగ్ బ్రదర్ షో మాజీ జస్మిన్ లెన్నార్డ్ కూడా ఉన్నది. ఆమె గతంలో రొనాల్డోతో డేటింగ్ చేయడం గమనార్హం.

    పోర్చుగల్ జాతీయ జట్టు కెప్టెన్ అయిన రొనాల్డో.. జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. ఫార్వర్డ్ ఆటగాడైన రొనాల్డో ప్రస్తుతం అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక కగోల్స్ రొనాల్డో పేరిటే ఉన్నాయి. రొనాల్డో భార్య పేరు జార్జియానా రోడ్రిగ్స్.. వీరికి నలుగురు సంతానం.
    Published by:John Naveen Kora
    First published: