Home /News /sports /

RANJI TROPHY SARFARAZ KHAN HIT 153 FROM 205 DELIVERIES FOR MUMBAI AGAINST UTTARAKHAND AND BREAKES THESE RECORDS SRD

Sarfaraz Khan : సలామ్ సర్ఫరాజ్ బాయ్.. బ్రాడ్​మన్ తర్వాత మనోడే.. సచిన్, కోహ్లీల వల్ల కూడా కాలేదు..!

Sarfaraz Khan (BCCI Twitter)

Sarfaraz Khan (BCCI Twitter)

Sarfaraz Khan : 2019-20 సీజన్‌ నుంచి సర్ఫరాజ్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్​ల్లోనే అతడు ఏకంగా 928 పరుగులు తీశాడు. అందులో ఒక ట్రిపుల్‌ సెంచరీ(301*) కూడా ఉంది.

    రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో పరుగుల వరద పారిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan). పరుగుల వరదతో పాటు రికార్డుల పని కూడా పడుతున్నాడు. ఈ సీజన్​లోనూ పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌ (First Class Cricket)లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో అత్యధిక సగటు నమోదు చేసిన భారత క్రికెటర్ (Indian Cricketer)​గా నిలిచాడు. క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో అతడు సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట సందర్బంగా ఈ సీజన్‌లో మూడో శతకం నమోదు చేసి సత్తా చాటాడు. ఇక ఇప్పటి వరకు అతడు 5 ఇన్నింగ్స్‌లో కలిపి 704 పరుగులు సాధించడం విశేషం. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ఈ క్రమంలో ముంబై(Mumbai) జట్టును క్వార్టర్స్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించి.. క్వార్టర్‌ ఫైనల్లోనూ అదరగొడుతున్న సర్ఫరాజ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

    2019-20 సీజన్‌ నుంచి సర్ఫరాజ్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్​ల్లోనే అతడు ఏకంగా 928 పరుగులు తీశాడు. అందులో ఒక ట్రిపుల్‌ సెంచరీ(301*) కూడా ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఆల్‌టైమ్‌ గ్రేట్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ (సగటు 95.14) తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక సగటు సర్ఫరాజ్‌దే (80.42). అంటే అతడు ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.



    టీమిండియా మాజీ క్రికెటర్​ విజయ్ మర్చంట్​ను (71.64) అతడు అధిగమించాడు. అయితే ఈ స్థాయిలో పరుగులు చేస్తున్నా ఇప్పటి వరకు టీమిండియా నుంచి మాత్రం అతడికి ఎలాంటి పిలుపురాలేదు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అతడ్ని వేలంలో కొనుగోలు చేసినా కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే ఆడటానికి అవకాశం ఇచ్చింది.

    ‘‘సర్ఫరాజ్‌ అద్భుతం... ప్రతిభావంతుడైన ఆటగాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు 2200కు పైగా పరుగులు సాధించిన ఈ ముంబై బ్యాటర్‌ మరింత గొప్పగా ఆడాలి’’ అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం అతడిపై ప్రశంసలు కురిపించాడు.




    ఇక మంగళవారం నాటి ఉత్తరాఖండ్‌ మ్యాచ్‌లో 205 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ 4 సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీకి తోడు సువెద్ పార్కర్ కూడా సెంచరీతో చెలరేగడంతో 122 ఓవర్లుమ ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 452 పరుగులు చేసిన ముంబై జట్టు, భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. పృథ్వీ షా 21 పరుగులు, యశస్వి జైస్వాల్ 35 పరుగులు చేసి అవుట్ కాగా అర్మాన్ జాఫర్ 60 పరుగులు చేశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Delhi Capitals, Mumbai, Sachin Tendulkar, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు