ముగిసిన రంజీ సమరం... టైటిల్ నిలబెట్టుకున్న విదర్భ... ఫైనల్‌లో సౌరాష్ట్ర చిత్తు...

78 పరుగుల తేడాతో ఫైనల్‌లో సౌరాష్ట్రను చిత్తుచేసిన విదర్భ... టైటిల్ నిలబెట్టుకున్న డిఫెండింగ్ ఛాంపియన్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 7, 2019, 5:15 PM IST
ముగిసిన రంజీ సమరం... టైటిల్ నిలబెట్టుకున్న విదర్భ... ఫైనల్‌లో సౌరాష్ట్ర చిత్తు...
రంజీ ట్రోఫీతో విదర్భ జట్టు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 7, 2019, 5:15 PM IST
సుదీర్ఘంగా సాగిన రంజీ ట్రోఫీ సమరం ముగిసింది. నాగ్‌పూర్‌లో జరిగిన ఫైనల్‌లో సౌరాష్ట్రను చిత్తుచేసిన డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ మరోసారి టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ విసిరిన 206 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌరాష్ట్ర... 127 పరుగులకే కుప్పకూలింది. దీంతో విదర్భకు 78 పరుగుల తేడాతో విజయం దక్కింది. విదర్భ బౌలర్లలో ఆల్‌రౌండర్ ఆదిత్య సర్వత్రే ఆరు వికెట్లు తీసి... సౌరాష్ట్ర ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. మరో బౌలర్ అక్షయ్ వాఖరే మూడు వికెట్లు తీయగా... సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు ఒక్క వికెట్ దక్కింది.

సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్‌లో విశ్వరాజ్ జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 52 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ఆ జట్టు ఓటమి ఖరారయ్యింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన ఐదు పరుగుల ఆధిక్యంతో కలిపి టార్గెట్ 205గా ఫిక్స్ చేసింది. విదర్భ జట్టులో ఆదిత్య సర్వత్రే 49 పరుగులు చేయగా... గణేశ్ సతీశ్ 35 పరుగులు, మోహిత్ కాలే 38 పరుగులు చేసి... జట్టు స్కోరు 200 మార్కు దాటడానికి కారణమయ్యారు.
Cricket news, Ranji Trophy Final 2018-19, Ranji final Vidarbha vs Saurashtra, Ranji trophy title winner 2019, రంజీ ట్రోఫీ 2019, రంజీ ఫైనల్ 2018-19, విదర్భ జట్టు రంజీ, సౌరాష్ట్ర, క్రికెట్ వార్తలు
ట్రోఫీతో కెప్టెన్ ఫైజ్ ఫజల్


ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించే క్రమంలో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సౌరాష్ట్ర. ఓవర్‌నైట్ స్కోర్ 58/5 వద్ద ఆఖరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌరాష్ట్ర మరో 69 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో వచ్చే నెలలో జరిగే ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్ ఇండియా టీమ్‌తో తలబడబోతోంది విదర్భ జట్టు.


First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...