Ranji trophy 2022: కోవిడ్-19 (covid 19 pandemic) వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఈ నెల 17 నుంచి ఆరంభమైన సంగతి తెలిసిందే. గతేడాది కరోనా వల్ల ఈ టోర్నీ జరుగలేదన్న బాధో ఏమో కానీ... తాజా సీజన్ లో మాత్రం ప్లేయర్స్ రికార్డ్స్ మీద రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. తొలి మ్యాచ్ సందర్భంగా అండర్ 19 ప్రపంచ కప్ (under-19 World cup) సారథి, ఢిల్లీ (Delhi) జట్టు ప్లేయర్ యశ్ ధుల్ (YAsh Dhull) రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలతో మెరవగా... బిహార్ (Bihar)కు చెందిన సకీబుల్ గనీ (Sakibul ghani) ట్రిపుల్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా టోర్నీలో జరుగుతోన్న రెండో రౌండ్ మ్యాచ్ ల్లో అత్యంత అరుదైన... మళ్లీ సాధ్యం కాని రికార్డు ఒకటి నమోదైంది. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి
కవలలు పుట్టడమే చాలా అరుదు. ఒక వేళ పుట్టినా వారిద్దరూ ఒకే రంగంలో అడుగుపెట్టడం కూడా అరుదే. ముఖ్యంగా క్రికెట్ లో. కానీ తమిళనాడు (tamil nadu)కు చెందిన ట్విన్స్ బాబా అపరజిత్ (baba aparajith), బాబా ఇంద్రజిత్ (baba indrajith) సంచలనం నమోదు చేశారు. కవలలుగా ఒకే రోజు పట్టడమే కాదు... తమిళనాడు జట్టుకు ఎంపికై... రంజీల్లో ఒకే రోజు ఇద్దరు కూడా శతకాలు నమోదు చేసి అరుదైన రికార్డును తమ సొంతం చేసుకున్నారు. చత్తీస్ గఢ్ (chhattisgarh)తో ఆరంభమైన గ్రూప్ హెచ్ మ్యాచ్ లో తమిళనాడు కవలల ద్వయం అప్రజిత్, ఇంద్రజిత్ మెరిసింది. తొలి రోజు ఆటలో వీరిద్దరు శతకాలతో అలరించారు. బాబా అపరజిత్ (267 బంతుల్లో 166; 15 ఫోర్లు, 4 సిక్సర్లు), బాబా ఇంద్రజిత్ (141 బంతుల్లో 127; 21 ఫోర్లు) ఒకే రోజు శతకాలతో మెరిశారు. దాంతో ఒకే రోజు శతకాలు బాదిన భారత ట్విన్స్ గా వీరిద్దరూ కూడా రికార్డు లిఖించారు. తొలుత ఇంద్రజిత్ శతకం బాదగా... అనంతరం అపరజిత్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 207 పరుగులు జోడించారు. దాంతో తొలి ఇన్నింగ్స్ ను తమిళనాడు 9 వికెట్లకు 470 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పంజాబ్ కింగ్స్ (punjab kings) బ్యాటర్ షారుఖ్ ఖాన్ 69 పరుగులు చేశాడు. ఛత్తీస్ గఢ్ బౌలర్లలో సుమీత్ నాలుగు వికెట్లు తీయగా... అజయ్ మండల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఛత్తీస్ గఢ్ రెండో రోజు టీ విరామ సమయానికి తమ తొలి ఇన్నింగ్స్ లో 21 ఓవర్లలో 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. ఛత్తీస్ గఢ్ మరో 425 పరుగులు వెనుకబడి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Covid -19 pandemic, Delhi, Punjab kings, Tamil nadu