హోమ్ /వార్తలు /క్రీడలు /

Ranji Trophy 2022 : రంజీ ఫైనల్లో రెచ్చిపోయిన ఆర్సీబీ స్టార్.. 41సార్లు చాంపియన్ ముంబై కి భారీ షాక్..

Ranji Trophy 2022 : రంజీ ఫైనల్లో రెచ్చిపోయిన ఆర్సీబీ స్టార్.. 41సార్లు చాంపియన్ ముంబై కి భారీ షాక్..

PC : TWITTER

PC : TWITTER

Ranji Trophy 2022 : ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji)లో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్లో 41సార్లు చాంపియన్ ముంబై (Mumbai) జట్టుకు భారీ షాక్ తగిలింది.

Ranji Trophy 2022 : ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji)లో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్లో 41సార్లు చాంపియన్ ముంబై (Mumbai) జట్టుకు భారీ షాక్ తగిలింది. 23 ఏళ్ల తర్వాత తొలిసారి మళ్లీ ఫైనల్ గడప తొక్కిన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జట్టు ఫైనల్లో ముంబై పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. 42వ సారి రంజీ చాంపియన్ గా నిలవాలని ఆశపడ్డ ముంబై జట్టుకు నిరాశే మిగిలింది. 1998-99 రంజీ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్‌ ఈసారి మాత్రం అవకాశం చేజారనివ్వలేదు. ముంబైతో జరిగిన ఫైనల్‌ పోరులో ఆధ్యంతం అధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది.

ఇది కూడా చదవండి  : ఓపెనింగ్ స్థానం కోసం తెలుగు ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ.. చాన్స్ ఎవరిదంటే?

ఓవర్ నైట్ స్కోరు 113/2తో చివరి రోజు ఆటను కొనసాగించిన ముంబై 269 పరుగులకు ఆలౌటైంది. మరోసారి సర్ఫరాజ్ ఖాన్ (45) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ పృథ్వీ షా (44) పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ బౌలర్ కుమార్ కార్తికేయ సింగ్ 4 వికెట్లతో ప్రత్యర్థిని పడగొట్టాడు. అతడికి గౌరవ్ యాదవ్, పార్థ్ సహాని చెరో రెండు వికెట్లతో సహకారం అందించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన మధ్యప్రదేశ్ జట్టు 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 29.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుని చాంపియన్ గా నిలిచింది. హిమాన్షు మాంత్రి (37), శుభమ్ శర్మ (30), రజత్ పటిదార్ (30 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు.

ముంబై జట్టుకు ఇది 46వ ఫైనల్ కావడం విశేషం. మధ్యప్రదేశ్ కు మాత్రం రెండోది. అందులోనూ 23 ఏళ్ల తర్వాత కానీ మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేదు. తుది పోరులో ముంబై హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్ లో ముంబై 374 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్(134) సెంచరీ చేశాడు. ఇక మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో రెచ్చిపోయింది. ఏకంగా 536 పరుగులు చేసింది. జట్టులోని ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం. యశ్ దూబే (133), శుభం శర్మ (116)లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ రజత్ పటిదార్ (122) శతకాలు బాదడంతో మధ్యప్రదేశ్ భారీ స్కోరును అందుకుంది.

First published:

Tags: Cricket, Madhya pradesh, Mumbai, Prithvi shaw

ఉత్తమ కథలు