RANJI TROPHY 2022 MUMBAI OPENER YASHASVI JAISWAL RAISES BAT AFTER SCORING HIS FIRST RUN ON 54TH BALL SJN
Ranji Trophy : ఆకలేస్తే అన్నం తినాలి ఇలా బంతులను కాదు.. పుజారాలా మారిపోయిన ముంబై స్టార్ ప్లేయర్.. ఏం జరిగిందంటే?
పుజారా, ముంబై రంజీ టీమ్ (ఫైల్ ఫోటో)
Ranji Trophy 2022: దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఆఖరి అంకానికి చేరుకుంది. కరోనా వల్ల గతేడాది జరగకపోయిన ఈ టోర్నీని.. ఈ ఏడాది ఎలాగైనా జరిపాలని బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది.
Ranji Trophy 2022: దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఆఖరి అంకానికి చేరుకుంది. కరోనా వల్ల గతేడాది జరగకపోయిన ఈ టోర్నీని.. ఈ ఏడాది ఎలాగైనా జరిపాలని బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీజన్ ను కుదించి రెండు అంచెలుగా జరిగేలా షెడ్యూల్ ను రూపొందించింది. ఐపీఎల్ కు ముందు తొలి అంచెను జరుపగా.. ఐపీఎల్ (IPL) అనంతరం రెండో అంచెను మొదలు పెట్టింది. ప్రస్తుతం సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో మధ్యప్రదేశ్, బెంగాల్ జట్లు తలపడుతోండగా.. రెండో సెమీస్ లో ముంబై, ఉత్తర ప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి.
అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆట మూడో రోజు ముంబై జట్టు తమ రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించగా.. ఓపెనర్ గా వచ్చిన యశిస్వి జైస్వాల్ తొలి పరుగు సాధించడానికి ఏకంగా 54 బంతులు అవసరం అయ్యాయి. తొలి 53 బంతులకు ఒక్క పరుగు కూడా చేయని అతడు 54వ బంతికి ఫోర్ కొట్టి పరుగుల ఖాతా తెరిచాడు. దాంతో జైస్వాల్ ఏదో సెంచరీ చేసిన వాడిలా బ్యాట్ ఎత్తి తొలి పరుగును సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ లో ముంబై జట్టు పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో393 పరుగులకు ముంబై ఆలౌట్ కాగా.. ఉత్తర్ ప్రదేశ్ జట్టు 180 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై నాలుగో రోజు లంచ్ విరామానికి తమ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. అర్మాన్ జాఫర్ (80 బ్యాటింగ్; 12 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (77 బ్యాటింగ్, 10 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. సారథి పృథ్వీ షా (64; 12 ఫోర్లు) రాణించాడు. ప్రస్తుతం ముంబై 448 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మరో సెమీఫైనల్ మ్యాచ్ లో బెంగాల్ పై మధ్యప్రదేశ్ ఆధిక్యంలో ఉంది. ఆటకు రేపు చివరి రోజు. ఫైనల్లో ముంబైతో మధ్యప్రదేశ్ తలపడేది దాదాపుగా ఖాయం అయ్యింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.