Home /News /sports /

RANJI TROPHY 2022 MADHYA PRADESH COACH CHANDRAKANT PANDIT ACHIEVED WHAT HE COULD NOT 23 YEARS AGO AS A CAPTAIN SJN

Ranji Trophy 2022 : అప్పుడు కెప్టెన్ గా ఓడాడు.. ఇప్పుడు కోచ్ గా గెలిచాడు.. చెక్ దే ఇండియా సినిమాను గుర్తు చేసిన..

PC : TWITTER

PC : TWITTER

Ranji Trophy 2022 : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (shahrukh khan) నటించిన చెక్ దే ఇండియా (chak de india) 2007లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. హాకీ క్రీడాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది.

ఇంకా చదవండి ...
Ranji Trophy 2022 : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (shahrukh khan) నటించిన చెక్ దే ఇండియా (chak de india) 2007లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. హాకీ క్రీడాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇక 2007 టి20 ప్రపంచకప్ (World cup)లో భారత్ కు ఈ సినిమా బూస్టర్ లా పనిచేసింది కూడా. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కబీర్ ఖాన్ పాత్రలో టీమిండియా పురుషుల జట్టు కెప్టెన్ గా.. అనంతరం భారత మహిళల జట్టు కోచ్ గా కనిపిస్తాడు. కెప్టెన్ గా టైటిల్ నెగ్గలేకపోయిన అతడు అనంతరం కోచ్ గా అది సాధిస్తాడు. ఇప్పుడు ఇటువంటి సంఘటనే రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ చోటు చేసుకుంది. ఆదివారం ముగిసిన రంజీ ట్రోఫీ 2022 సీజన్ ఫైనల్లో 41సార్లు చాంపియన్ ముంబై (Mumbai)పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి తొలిసారి చాంపియన్ గా అవతరించింది.

ఇది కూడా చదవండి  : ఉమ్రాన్ కంటే వేగంగా బౌలింగ్ చేసిన భువీ.. గంటకు 208 కి.మీలతో ప్రపంచ రికార్డు.. కానీ..

ఇక రంజీ చాంపియన్ గా మధ్యప్రదేశ్ నిలవడంలో ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్ర ఎంతో ఉంది. మధ్యప్రదేశ్ 1999 రంజీ సీజన్ లో ఫైనల్ కు చేరుకుంది. ఆ జట్టుకు చంద్రకాంత్ పండిట్ కెప్టెన్ గా ఉన్నాడు. కర్ణాటక జట్టుతో తుది పోరు జరగ్గా.. మ్యాచ్ ను మధ్యప్రదేశ్ అద్భుతంగా ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్ లో 75 పరుగుల ఆధిక్యాన్ని కూడా సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అనూహ్యంగా కుప్పకూలి రన్నరప్ గా నిలిచింది. అనంతరం మళ్లీ మధ్యప్రదేశ్ ఈ ఏడాది వరకు కూడా రంజీల్లో ఫైనల్ గడప తొక్కలేదు.



ఇక ఈ సీజన్ లో మధ్యప్రదేశ్ ఫైనల్ కు చేరుకుంది. ఈసారి చంద్రకాంత్ ఆటగాడిగా కాకుండా కోచ్ గా మధ్యప్రదేశ్ జట్టులో భాగంగా ఉన్నాడు. 1999 నాటి తప్పులను రిపీట్ చేయకుండా ఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు అద్భుతంగా ఆడేలా చంద్రకాంత్ చూసుకున్నాడు. ముంబై లాంటి మేటి జట్టుతో ఆడుతున్నా తన జట్టు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 500 పైచిలుకు పరుగులు సాధించి.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి మధ్యప్రదేశ్ కు తొలి రంజీ టైటిల్ ను చంద్రకాంత్ పండిట్ అందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన చంద్రకాంత్.. భావోద్వేగానికి గురయ్యాడు. ఆటగాళ్లను ప్రశంసించాడు. 1999, 2022 రెండు సందర్భాల్లోనూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియమే రంజీ ఫైనల్ కు ఆతిథ్యమిచ్చింది. నాడు అదే గ్రౌండ్ లో ఏడ్చిన చంద్రకాంత్.. నేడు మళ్లీ అదే గ్రౌండ్ లో చాంపియన్ అయ్యాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bengaluru, Cricket, Madhyapradesh, Mumbai

తదుపరి వార్తలు