Home /News /sports /

RANJI TROPHY 2022 FINAL MUMBAI INDIANS AND MADHYAPRADESH TEAMS REACHES RANJI TROPHY 2022 SEASON FINAL SJN

Ranji Trophy : ఒక జట్టుకేమో 47వది.. మరో జట్టుకేమో రెండోది.. కప్పు కొట్టేదెవరో మరీ?

ముంబై, మధ్య ప్రదేశ్ జట్లు

ముంబై, మధ్య ప్రదేశ్ జట్లు

Ranji Trophy : దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంది. కరోనా వల్ల గతేడాది ఈ టోర్నీ జరగలేదు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఏడాది కూడా ఒక దశలో జరిగేలా కనిపించలేదు. దాంతో రెండు అంచెలుగా రంజీ ట్రోఫీని నిర్వహించేలా బీసీసీఐ (BCCI) ప్రణాళిలను వేసింది.

ఇంకా చదవండి ...
Ranji Trophy : దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంది. కరోనా వల్ల గతేడాది ఈ టోర్నీ జరగలేదు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఏడాది కూడా ఒక దశలో జరిగేలా కనిపించలేదు. దాంతో రెండు అంచెలుగా రంజీ ట్రోఫీని నిర్వహించేలా బీసీసీఐ (BCCI) ప్రణాళిలను వేసింది. తొలి అంచె ఐపీఎల్ కు ముందు జరగ్గా.. రెండో అంచె ప్రస్తుతం జరుగుతుంది. సెమీఫైనల్స్ ను పూర్తి చేసుకున్న రంజీ ట్రోఫీ ఈ నెల 22న ఆరంభమయ్యే ఫైనల్ తో ముగుస్తుంది. అయితే డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్ర జట్టు ఈసారి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. అయితే ముంబై (Mumbai) జట్టు రికార్డు స్థాయిలో 47వ సారి ఫైనల్ కు అర్హత సాధించగా.. 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మధ్యప్రదేశ్ (Madyapradesh) జట్టు ఫైనల్ కు అర్హత సాధించింది. చివరిసారిగా మధ్యప్రదేశ్ 1998-1999 సీజన్ లో ఫైనల్ కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ కు ఇది 47వ ఫైనల్ అయినప్పటికీ ఐదేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇది కూడా చదవండి : ఫినిషర్ గా కార్తీక్ సెట్ అవ్వడా.? అతడి కంటే అక్షర్ బెస్టా.. ఏ లెక్కన చెబుతున్నావ్ బాబూ..

ఓవర్‌నైట్‌ స్కోరు 449/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబై మరో 16 ఓవర్లలో 84 పరుగులు జోడించి 533/4 వద్ద డిక్లేర్‌ చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (59 నాటౌట్‌), షమ్స్‌ ములాని (51 నాటౌట్‌) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌ 213 పరుగుల ఆధిక్యం కలిపి ముంబై మొత్తం స్కోరు 746కు చేరింది. ముంబై ముందంజ వేయడం ఖాయం కావడంతో యూపీ రెండో ఇన్నింగ్స్‌ ఆడేందుకు బరిలోకి దిగలేదు. గతంలో 46 సార్లు రంజీ ఫైనల్‌ చేరిన ముంబై 41 సార్లు టైటిల్‌ గెలుచుకొని ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది.


ఇక బెంగళూరు వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో బెంగాల్ పై 174 పరుగుల భారీ తేడాతో నెగ్గిన మధ్యప్రదేశ్ 23 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించంది. 350 పరుగుల భారీ లక్ష్యంతో.. ఓవర్ నైట్ స్కోరు 96/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన బెంగాల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ఆరంభమైంది. వాన తగ్గాక మ్యాచ్ ఆరంభం కాగా 28.2 ఓవర్లలో ఓవర్ నైట్ స్కోరుకు మరో 79 పరుగులు జోడించిన బెంగాల్ తన చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఫైనల్ ఈ నెల 22 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Bengaluru, India vs South Africa, Madhya pradesh, Mumbai, Prithvi shaw

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు