RANJI TROPHY 2022 CRICKET GOD SACHIN TENDULKAR CONGRATULATES SAKIBUL GANI FOR HIS RECORD BREAKING TRIPLE CENTURY SJN
Ranji trophy 2022: ఆ కుర్రాడికి క్రికెట్ దేవుడు సచిన్ నుంచి శుభాకాంక్షలు... అతడెవరంటే?
సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫోటో)
Ranji trophy 2022: ప్రస్తుతం జరుగుతోన్న రంజీ టోర్నీ సీజన్ లో ఆడుతూ తన బ్యాటింగ్ తో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కళ్లలో పడ్డాడో కుర్రాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అరంగేట్రం మ్యాచ్ లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా సచిన్ కూడా శుభాకాంక్షలు తెలిపి అతడి స్థాయిని మరో పెట్టుపై నిలిపాడు. ఇంతకీ ఆ కుర్రాడోవడో తెలుసుకోవాలంటే చదవండి మరీ..
Ranji trophy 2022: రంజీ ట్రోఫీ లో అనామక ప్లేయర్ గా అరంగేట్రం చేసిన బిహార్ (Bihar) కుర్రాడు తన డెబ్యూ మ్యాచ్ లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. మిజోరం (Mizoram)తో గత గురువారం ఆరంభమైన మ్యాచ్ లో బిహార్ బ్యాటర్ సకీబుల్ గనీ ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 405 బంతులను ఎదుర్కొన్న గనీ 341 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇందులో 56 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. దాంతో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతూ ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా సకీబుల్ గనీ చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా అరంగేట్ర మ్యాచ్ లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా కూడా సకీబుల్ గనీ నిలిచాడు. గతంలో డెబ్యూ మ్యాచ్ లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా మధ్య ప్రదేశ్ కు చెందిన అజయ్ రోహేరా ఉన్నాడు. 2018- 19 సీజన్ లో హైదరాబాద్ పై అజయ్ 267 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా ఆ రికార్డు కాస్తా సకీబుల్ గనీ పేరు మీదకు బదిలీ అయ్యింది. సకీబుల్ ఇన్నింగ్స్ కు సంబంధించిన ఒక వీడియోను బీసీసీఐ (BCCI) తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.
సకీబుల్ గనీ రికార్డుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar) ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సకీబుల్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ’ అరంగేట్ర మ్యాచ్ లోనే నీ అసాధారణ ప్రతిభతో అందరి చేేత శభాష్ అనిపించుకున్నావు. నీ ట్రిపుల్ సెంచరీకి శుభాకాంక్షలు‘ అని అర్థం వచ్చేలా బీసీసీఐ ట్వీట్ కు రిప్లై చేశాడు.
Congratulations to Sakibul Gani for a solid performance in his debut Ranji Trophy match.
ఇదే మ్యాచ్ లో మరో బిహారీ బ్యాటర్ బబుల్ కుమార్ డబుల్ సెంచరీ చేశాడు. అతడు 398 బంతుల్లో 2229 పరుగులు చేశాడు. ఇందులో 27 ఫోర్లు ఒక సిక్సర్ ఉండటం విశేషం. సకీబుల్, బబుల్ కుమార్ సూపర్ బ్యాటింగ్ తో బిహార్ తమ తొలి ఇన్నింగ్స్ ను 5 వికెట్లకు 686 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన మిజోరం తమ తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌటైంది. జట్టు సారథి కోహ్లీ 151 పరుగులతో సెంచరీ చేశాడు. ఫాలో ఆన్ స్కోరును దాటలేకపోవడంతో ఆ జట్టు మళ్లీ బ్యాటింగ్ కు దిగింది. ఆట చివరి రోజు ముగిసే సమయానికి మిజోరం 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ కోహ్లీ 101 పరుగులతో అజేయ సెంచరీ సాధించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.