Ranji trophy 2022: ప్రస్తుతం జరుగుతోన్న దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో రోజుకో రికార్డు బద్దలవుతూనే ఉంది. నిన్న ఢిల్లీ బ్యాటర్, అండర్ 19 ప్రపంచ కప్ సారథి యశ్ ధుల్ తన అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ చేసి సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) సరసన నిలిస్తే.... తాజాగా మరో బ్యాటర్ ఏకంగా ప్రపంచ రికార్డు (World record)నే నెలకొల్పాడు. కరోనా వల్ల గతేడాది జరగని రంజీ ట్రోఫీ... ఈ ఏడాది కూడా తొలుత వాయిదా పడింది. అయితే ఒమిక్రాన్ శాంతించడంతో ఫిబ్రవరి 17 నుంచి ఆరంభమైంది. ఈ నేపథ్యంలో మిజోరం (Mizoram), బిహార్ (Bihar) జట్ల మధ్య కోల్ కతా (Kolkata) వేదికగా ఆరంభమైన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ప్రపంచ రికార్డుకు వేదికైంది. బిహార్ తరఫున సకీబుల్ గనీ (Sakibul gani) ఈ మ్యాచ్ తో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అరంగేట్రం చేశాడు. అయితే ఈ అరంగేట్ర మ్యాచ్ తోనే ప్రపంచ రికార్డును నెలకొల్పి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
మిజోరంతో గురువారం ఆరంభమైన రంజీ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన బిహార్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. దీనికంతా కారణం ఐదో వరుసలో బ్యాటింగ్ కు దిగిన సకీబుల్ గనీ. అతడు మిజోరంతో మ్యాచ్ తో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో 405 బంతులను ఎదుర్కొన్న గనీ 341 పరుగులు చేసి ట్రిపుల్ శతకాన్ని సాధించాడు. ఇందులో 56 ఫోర్లు, సిక్సర్లు ఉండటం విశేషం. దాంతో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతూ ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా సకీబుల్ గనీ చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా అరంగేట్ర మ్యాచ్ లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా కూడా సకీబుల్ గనీ నిలిచాడు. గతంలో డెబ్యూ మ్యాచ్ లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా మధ్య ప్రదేశ్ కు చెందిన అజయ్ రోహేరా ఉన్నాడు. 2018 19 సీజన్ లో హైదరాబాద్ పై అజయ్ 267 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా ఆ రికార్డు కాస్తా సకీబుల్ గనీ పేరి మీదకు బదిలీ అయ్యింది. ఇదే మ్యాచ్ లో మరో బిహారీ బ్యాటర్ బబుల్ కుమార్ డబుల్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇతడు 218 పరుగులతో ఇంకా బ్యాటింగ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. బబుల్ కుమార్, సకీబుల్ గనీ కలిసి నాలుగో వికెట్ కు 399 పరుగులు జోడించారు. దాంతో బిహార్ రెండ ోరోజు టీ విరామ సమయానికి తమ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 646 పరుగులు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Kolkata, Mizoram, Sachin Tendulkar