హోమ్ /వార్తలు /క్రీడలు /

Ranji Trophy 2022: కన్న కూతురి అంత్యక్రియలు పూర్తి చేసి.. వెంటనే అజేయ శతకంతో మెరిసి

Ranji Trophy 2022: కన్న కూతురి అంత్యక్రియలు పూర్తి చేసి.. వెంటనే అజేయ శతకంతో మెరిసి

విష్ణు సొలంకీ (ఫైల్ ఫోటో)

విష్ణు సొలంకీ (ఫైల్ ఫోటో)

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ (Ranji trophy) తాజా సీజన్ లో మనుసును కదిలించే ఓ సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర బాధలో ఉన్న బరోడా ప్లేయర్ తన జట్టు అవసరాల కోసం తన కన్నీళ్లను పంటి బిగువున దాచి పెట్టి బరిలోకి దిగాడు. క్రికెట్ పట్ల అతడికి ఉన్న అంకిత భావంపై సహచర క్రికెటర్ల నుంచి నీరాజనాలు అందుకుంటున్నాడు.

ఇంకా చదవండి ...

Ranji Trophy 2022: విష్ణు సొలంకీ (Vishnu solanki) నిన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు. అయితే క్రికెట్ (cricket) పట్ల అతడికి ఉన్న అంకిత భావం ఈ పేరును దేశమంతా తెలిసేలా చేస్తోంది. జీవితంలో మనం ఎప్పుడు కూడా మనకు తెలిసిన వారి మరణ వార్త (Death news) వినకూడదని కోరుకుంటాం. ఒక వేళ దురదృష్టం కొద్ది వింటే... దాని నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పడుతుంది. అదే మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా మరణిస్తే దాని నుంచి కొన్నిసార్లు మనం తేరుకోక పోవచ్చు కూడా... అయితే విష్ణు సొలంకీ మాత్రం తేరుకున్నాడు. కన్నీళ్లను పంటి బిగువున దాచిపెట్టి... బ్యాట్ పట్టి శతకం (century)తో మెరిశాడు. ఇంతకీ ఈ సొలంకీ ఎవరూ... అతడికి వచ్చిన కష్టమేంటో తెలుసుకోవాలంటే చదవండి

విష్ణు సొలంకీ తాజాగా జరుగుతోన్న రంజీ ట్రోఫీ (Ranji trophy)లో బరోడా (baroda) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోవిడ్ 19 (Covid 19 pandemic) కారణంతో గతేడాది జరగాల్సిన రంజీ టోర్నీ రద్దు కాగా... ఈ ఏడాది పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఆరంభమైంది. అందరు ఆటగాళ్లలాగే విష్ణు కూడా సంతోషంగా రంజీ ట్రోఫీకి సిద్ధమయ్యాడు. ఈ నెల 11వ తేది అతడి ఆనందాన్ని మరింత పెంచేలా... ఇంటి నుంచి ఓ వార్త వచ్చింది. అదే అతడు తండ్రయ్యాడని. విష్ణు భార్య ఈ నెల 11వ తేదిన పండంటి ఆడ శిశువుకు (new born baby) జన్మనిచ్చింది. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. సరిగ్గా 24 గంటలు గడిచాయో లేదో పుట్టిన శిశువు అనారోగ్య కారణంతో మరణించిందనే పిడుగు లాంటి వార్తను అతడు విన్నాడు. వెంటనే తన కూతురిని చివరిసారి చూడటానికి జట్టును వదిలి స్వస్థలానికి చేరుకున్నాడు. అక్కడ తన కూతురి అంత్యక్రియలను పూర్తి చేసి మళ్లీ క్రికెట్ ఆడటానికి జట్టుతో కలిశాడు. అయితే 17 నుంచి ఆరంభమైన తొలి రౌండ్ పోరులో అతడు బరోడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఎందుకంటే అతడు బయో బబుల్ ను దాటి బయటకు వెళ్లాడు  కాబట్టి. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అతడు నిబంధనల ప్రకారం క్వారంటైన్ ను పూర్తి చేయాలి. దాంతో అతడు తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక ఈ నెల 23న అతడి క్వారంటైన్ పూర్తవ్వడంతో జట్టుతో కలిశాడు.

24 నుంచి  ఛండీగఢ్ (Chandigarh)తో ఆరంభమైన రెండో రౌండ్ మ్యాచ్ లో బరిలోకి దిగిన సొలంకీ తన బ్యాట్ తో సత్తా చాటాడు. 161 బంతుల్లో 103 పరుగులతో అజేయ సెంచరీ సాధించాడు. ఇందులో 12 ఫోర్లు ఉండటం విశేషం. కూతురు మరణించిన బాధను దిగమింగి... అద్భుత ఇన్నింగ్స్ తో తన జట్టును ఆదుకున్న తీరుకు సహచర క్రికెటర్లు ఫిదా అయ్యారు. విష్ణు డెడికేషన్ కు హ్యాట్సాఫ్ కూడా చెప్పారు. ప్రస్తుతం బరోడో 7 వికెట్లకు 398 పరుగులు చేసింది. దాంతో 230 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఛండీగఢ్ 168 పరుగులకే చాప చుట్టేసింది.

First published:

Tags: Covid 19 restrictions, Cricket, New born baby

ఉత్తమ కథలు