RANJI TROPHY 2021 22 ARJUN TENDULKAR GETS LUCKY CHANCE AND SREESANTH RE ENTRY TO KERALA TEAM SRD
సచిన్ తనయుడు Arjun Tendulkarకు లక్కీ ఛాన్స్.. శ్రీశాంత్ మళ్లీ రీఎంట్రీ..
Arjun Tendulkar - Sreesanth
సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో కేరళను నడిపించిన సంజూ శాంసన్, రంజీ ట్రోఫీలో ఆడుతున్నా, కెప్టెన్సీ చేయడం లేదు. ఇక, భారత మాజీ పేసర్ శ్రీశాంత్, 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ (Ranji trophy 2021-22) వచ్చే నెలలో పునఃప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో, రంజీ ట్రోఫీలో పాల్గొనే 20 మంది సభ్యుల ముంబై జట్టు (Mumbai Team)ను బుధవారం ప్రకటించారు. పృథ్వీ షా (Prithvi Shaw) ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్, ఆదిత్య తారే, శివమ్ దూబేవంటి ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉంది. దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమారుడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌కు కూడా ముంబై జట్టులో చోటు లభించింది. గత ఏడాది ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున రెండు టి20 మ్యాచ్ లు ఆడిన 22 ఏళ్ల అర్జున్ను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్ తీసుకున్నా...మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జనవరి 13నుంచి జరిగే తమ తొలి పోరులో మహారాష్ట్రతో ముంబై తలపడుతుంది. ఐపీఎల్ చివరి సీజన్ కోసం అర్జున్ ముంబై ఇండియన్స్ జట్టులో కూడా భాగమయ్యాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ అతనికి అవకాశం రాలేదు.
41 సార్లు రంజీ టైటిల్ గెలిచిన ముంబై జట్టు, గ్రూప్ Cలో 9 జట్లతో మ్యాచులు ఆడుతుంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్ టీమ్‌ని రంజీ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నడిపించబోతున్నాడు. కర్ణ్ శర్మతో పాటు రింకూ సింగ్, ప్రియమ్ గార్గ్, శివమ్ మావి, అంకిత్ రాజ్‌పుత్ వంటి ఐపీఎల్ స్టార్లకు యూపీ రంజీ టీమ్‌లో చోటు దక్కింది.
ఇక, తమిళనాడు జట్టును టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నడిపించబోతున్నాడు. వాషింగ్టన్ సుందర్ రంజీ ట్రోఫీలో తమిళనాడుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కేరళ జట్టుకు కెప్టెన్ గా సచిన్ బేబీ ఎంపికయ్యాడు. విష్ణు వినోద్‌కి వైస్ కెప్టెన్సీ దక్కింది.
సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో కేరళను నడిపించిన సంజూ శాంసన్, రంజీ ట్రోఫీలో ఆడుతున్నా, కెప్టెన్సీ చేయడం లేదు. ఇక, భారత మాజీ పేసర్ శ్రీశాంత్, 9 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రంజీ ట్రోఫీ 2021-22 టోర్నీకి ప్రకటించిన 24 మందిలో శ్రీశాంత్‌కి చోటు దక్కింది. అయితే రాబిన్ ఊతప్ప ఫిట్నెస్ లేమీ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.