ఆరుగురు డకౌట్... 35 ఆలౌట్... రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చెత్త రికార్డు...

Ranji Trophy 2018-19: ఆంధ్రప్రదేశ్ జట్టుకు భారీ విజయం... 35 పరుగులకే ఆలౌట్ అయ్యిన మధ్యప్రదేశ్ టీమ్... రంజీ ట్రోఫీతో సరికొత్త రికార్డు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 9, 2019, 9:52 PM IST
ఆరుగురు డకౌట్... 35 ఆలౌట్... రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చెత్త రికార్డు...
రింకూ సింగ్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 9, 2019, 9:52 PM IST
342 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది... అరరె... జట్టు కష్టాల్లో ఉందనుకున్నారు అభిమానులు. అయితే మధ్యప్రదేశ్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చారు ప్రత్యర్థి బౌలర్లు. 35/3 నుంచి అదే స్కోరుకి ఆలౌట్ అయ్యిందా జట్టు. ఇదేదో చిన్నాచితకా టోర్నమెంట్‌లో జరిగిన రికార్డు కాదు. రంజీ ట్రోఫీ 2018-19లో నమోదైన చెత్త రికార్డు. మధ్యప్రదేశ్ జట్టు అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుని భారీ తేడాతో పరాజయం పాలైంది. ఆంధ్రా అద్భుత విజయంతో చరిత్ర క్రియేట్ చేసింది. ఒక్క పరుగు కూడా చేయకుండానే మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. అవును... ఊహించని విధంగా జరిగిన ఈ వికెట్ల పతనానికి ఐదుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ కావడం విశేషం. మధ్యప్రదేశ్ జట్టు ఆటగాళ్లలో ఆర్యమాన్ బిర్లా 12 పరుగులు, యష్ దూబే 16 పరుగులే అత్యధికం.

మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కాగా... ఐదు బ్యాట్స్‌మెన్లు సున్నాకే పెవిలియన్ చేరారు. ఆంధ్రప్రదేశ్ యంగ్ క్రికెటర్ కేవీ శశికాంత్ ఆరు వికెట్లు తీసి... ప్రత్యర్థి పతనంలో కీలక పాత్ర పోషించగా... విజయ్ కుమార్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఒక్క బ్యాట్స్‌మెన్ అబ్‌సెంట్ హార్ట్‌గా అవుటయ్యాడు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ జట్టు 342 పరుగులు చేసింది. ప్రత్యర్థి 35 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో ఆంధ్రా జట్టుకు 307 పరుగుల భారీ విజయం దక్కింది.First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...