హోమ్ /వార్తలు /క్రీడలు /

rana daggubati: భళ్లాలదేవుడిపై ప్రశంసల వర్షం కురిపించిన wwe super star జాన్ సీనా

rana daggubati: భళ్లాలదేవుడిపై ప్రశంసల వర్షం కురిపించిన wwe super star జాన్ సీనా

rana daggubati: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై  డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా ప్రశంసలు కురిపించాడు. ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్... తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా డబ్ల్యూడబ్ల్యూఈని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రచారకర్తగా టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా ఉన్నాడు.

ఇంకా చదవండి ...

Rana daggubati: క్రికెట్ (Cricket), ఫుట్ బాల్ (Foot ball), టెన్నిస్ (tennis), ఫార్ములా వన్ (Formula one) ఇలా ఎన్నో పాపులర్ క్రీడలు ఉన్నా... అమెరికా (America) వేదికగా జరిగే WWE కి ఉండే క్రేజే వేరు. అమెరికాలో ఈ రెజ్లింగ్ గేమ్ ను ఎంతలా ఆదరిస్తారో అంతకు మించి భారత్ లో  WWEకి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. నాటి తరం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అండర్ టేకర్, గోల్డ్ బర్గ్, ఎడ్జ్, బటిస్టా, జాన్ సీనా నుంచి నేటి తరం రెజ్లర్స్ రోమన్ రెయిన్స్, సెత్ రాలిన్స్, డ్రూ మాకన్ టైర్, ఏజే స్టయిల్స్ వరకు కూడా ఇండియాలో మంచి ఆదరణ పొందారు. ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్... తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా డబ్ల్యూడబ్ల్యూఈని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రచారకర్తగా టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా (Rana daggubati) ఉన్నాడు.

తాజాగా మన భళ్లాలదేవుడిపై డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ లో డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రచార కర్తగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ జాన్ సీనా రెజ్లింగ్ జర్నీపై ఓ వీడియో చేసింది. దీని ప్రమోషన్స్ కోసం రానా, కొంత మంది యువకులతో కలిసి ఓ వీడియోను రూపొందించింది. ఈ ప్రమోషన్ వీడియోలో భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ రానా దగ్గుబాటి సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్, డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాకు ధన్యవాదాలు తెలియజేశాడు. అదే సమయంలో జాన్ సీనాను ఉద్దేశిస్తూ చాలా మందికి నువ్వు ప్రేరణ అంటూ కామెంట్ చేశాడు.

రానా ట్వీట్ కు స్పందించిన జాన్ సీనా... నువ్వు ట్వీట్ చేయడం గొప్పగా ఉందనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు.  అంతేకాకుండా నెవర్ గివప్ అనే సందేశాన్ని తన అభిమానులకు ఇచ్చాడు.

First published:

Tags: Cricket, Foot ball, Rana daggubati, Wwe

ఉత్తమ కథలు