Exclusive: టీమిండియా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలా? వద్దా?... న్యూస్‌18 ప్రశ్నకు రాజ్‌నాథ్ సింగ్ క్లారిటీ

భారత ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని గతంలో బీసీసీఐ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాలా? వద్దా? అనే బాల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది.

news18-telugu
Updated: March 16, 2019, 7:09 PM IST
Exclusive: టీమిండియా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలా? వద్దా?... న్యూస్‌18 ప్రశ్నకు రాజ్‌నాథ్ సింగ్ క్లారిటీ
రాజ్‌నాథ్ సింగ్
news18-telugu
Updated: March 16, 2019, 7:09 PM IST
భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలహీనంగా ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య క్రికెట్ వార్ కూడా ఓ హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే వరల్డ్ కప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడకూడదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలంటే, క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని రెండు జట్లు మ్యాచ్ ఆడాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని గతంలో బీసీసీఐ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాలా? వద్దా? అనే బాల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఈ అంశంపై ప్రశ్నించింది న్యూస్‌18. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ప్ర. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకూడదు. అలాగే, పాక్ నటులు ఇండియాకు రాకూడదనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో మీరు ఏకీభవిస్తారా?

జ. ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తులు ఎవరూ ఇలాంటివి జరగాలని కోరుకోరు. అయితే, కాలాన్ని బట్టి పరిస్థితిలో మార్పు రావొచ్చు.

ప్ర. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడాలా? వద్దా?



జ.దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. దీనిపై నా సలహా ఏమీ లేదు. నన్ను సలహా అడిగితే అప్పుడు చెబుతా.

ప్ర. ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ మీద భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. కాబట్టి మ్యాచ్ ఆడాలి.. రెండు పాయింట్లు గెలవాలని కొందరు పెద్ద క్రికెటర్లు అంటున్నారు.

జ. ఆ విషయంలో చర్చకు నేను వెళ్లాలనుకోవడం లేదు. ప్రతి వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. నిర్ణయం తీసుకునే అధికారం బీసీసీఐకే ఇస్తా. కానీ, ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు జాతి ఆత్మాభిమానం దెబ్బతినకుండా చూసుకోవాలి.

ప్ర. ప్రజల్లో భావోద్వేగం ఉంది. వారి అభిప్రాయాన్ని మనం గౌరవించాలి అంటారు. అంతేనా?

జ. కరెక్ట్.
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...