హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Pakistan: ఇండియా- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుందా.. ఫ్యాన్స్‌కు బీసీసీఐ క్లారీటి!

India vs Pakistan: ఇండియా- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుందా.. ఫ్యాన్స్‌కు బీసీసీఐ క్లారీటి!

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో 10 సెకెన్ల యాడ్ రేటు ఎంతో తెలుసా?

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో 10 సెకెన్ల యాడ్ రేటు ఎంతో తెలుసా?

పాక్‌తో మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా.. లేదా అనే సందేహాం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ ఆంశంపై క్లారీటి ఇచ్చారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా


India vs Pakistan Match: సాధరణంగా ఇండియా,పాకిస్థాన్ మ్యాచ్ అనగానే అందరిలోనూ హైటెన్షన్ మెుదలవుతుంది. అనేక వివాదాలు.. విమర్శలు వస్తునే ఉంటాయి. ఇండియా.. పాకిస్ధాన్‌ను శతృదేశంగా భావిస్తుండడంతో ఆ దేశంతో జరిగే ఎలాంటి పరిణామైన కాస్త వివాదాస్పదాల దారి తీస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ ఈవెంట్‌లో ఈ నెల 24న పాక్,భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా అనేక వివాదాలు ముందుకు వస్తున్నాయి. కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండియా- పాకిస్తాన్‌ టీ20 మ్యాచ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాక్ ప్రేరిపిత ముష్కరుల చర్యల కారణంగా కశ్మీర్‌లో ఆశాంతి నెలకొందని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా.. లేదా అనే సందేహాం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.


తాజాగా ఈ ఆంశంపై క్లారీటి ఇచ్చారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. కశ్మీర్‌లో ఉగ్ర చర్యలను ఖండిస్తూ.. ఐసీసీకి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేమని తెలిపారు. అంతర్జాతీయ టోర్నీలో అర్ధాతరంగా తప్పుకొవడం కుదరదన్నారు. నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఐసీసీ టోర్నీలో కచ్చితంగా ఆడాల్సిందేనని స్పష్టం చేశారు.

కశ్మీర్‌లో తాజా ఉగ్ర దాడుల నేపథ్యంలో భారత్‌- పాక్‌ మ్యాచ్‌‌పై పునరాలోచించాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో పాటు బిహార్‌ డిప్యూటీ సీఎం తార్‌కిషోర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో మ్యాచ్‌పై అభిమానుల్లో కాస్త టెన్షన్ నెలకొంది.

First published:

Tags: Bcci, ICC, India VS Pakistan, T20 World Cup 2021

ఉత్తమ కథలు