IPL 2021: ఓటమి బాధలోఉన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు షాక్.. వరుస మ్యాచ్‌లలో అదే తప్పు

ఓటమి బాధలో ఉన్న సంజూ శాంసన్‌కు షాకిచ్చిన మ్యాచ్ రిఫరీ (PC: IPL)

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ సంజూ శాంసన్‌కు మ్యాచ్ రిఫరీ రూ. 24 లక్షల భారీ జరిమానా విధించారు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా యూఏఈ వేదికగా రెండో దశ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) వరుస విజయాలకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అడ్డుకట్ట వేసింది. శనివారం మధ్యహ్నం అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రాజస్థాన్ జట్టు తమ ప్లేఆఫ్స్ అవకాశాలను కాస్త క్లిష్టతరం చేసుకున్నది. అయితే మ్యాచ్ ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) మ్యాచ్ రిఫరీ షాక్ ఇచ్చాడు. స్లో ఓవర్ రేటు కారణంగా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల కింద రూ. 24 లక్షల జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయనందుకే అతడికి భారీ జరిమానా విధించినట్లు తెలుస్తున్నది. ఇక జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం... ఏది తక్కువైతే దాన్ని జరిమానాగా విధించనున్నారు.

    సంజూ శాంసన్ ఈ సీజన్‌లో వరుసగా రెండో సారి సంజూ శాంసన్‌కు స్లో ఓవర్ రేటు తప్పదానికి జరిమానా విధించారు. అంతకు ముందు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేటు నమోదు చేయడంతో అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ నెల 21న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆ మ్యాచ్ జరిగింది. వరుసగా రెండో సారి అదే తప్పిదం చేయడంతో ఈ సారి గత జరిమానా కంటే రెట్టింపు మొత్తాన్ని అతడి మ్యాచ్ పీజు నుంచి కట్ చేయనున్నారు.

    DC vs RR: ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుకు రాజస్థాన్ బౌలర్ల కళ్లెం.. రాణించిన మిడిల్ ఆర్డర్.. టార్గెట్ ఎంతంటే?



     ఇక ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ ‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌లో విఫలం చెందింది. ఢిల్లీ నిర్దేశించిన 155 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవడానికి నానా అవస్థలు పడింది. సంజూ శాంసన్ అర్ద సెంచరీతో చెలరేగినా.. అతడికి సరైన సహకారం లేకపోవడంతో 121 పరుగులకే పరిమితం అయ్యింది.
    Published by:John Naveen Kora
    First published: