• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • RAJASTHAN ROYALS HOLD FAREWELL FOR STAR ALL ROUNDER BEN STOKES AND RECEIVED JERSEY WITH THE NAME OF HIS FATHER SRD

IPL 2021 : స్టోక్స్ కు ఎమోషనల్ సెండాఫ్.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందించిన రాజస్థాన్ రాయల్స్..

స్టోక్స్ కు ఎమోషనల్ సెండాఫ్.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందించిన రాజస్థాన్ రాయల్స్..

IPL 2021 : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ (Ben Stokes).. ఐపీఎల్‌ 2021 ప్రయాణాన్ని ఒక్క మ్యాచ్‌తోనే ముగించాడు. యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయం అయింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఫైనల్ని తలపించేలా ఉంది. విజయం కోసం ప్రతీ టీమ్ ఆఖరి వరకూ పోరుడుతున్నాయ్. అయితే, కొన్ని జట్లు కు మాత్రం గాయాల రూపంలో ఇబ్బందులు ఎదురువుతున్నాయ్. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కి ఈ ఏడాది బిగ్ షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ (Ben Stokes).. ఐపీఎల్‌ 2021 ప్రయాణాన్ని ఒక్క మ్యాచ్‌తోనే ముగించాడు. యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయం అయింది. దీంతో స్టోక్స్ కు డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో అతను స్వదేశానికి బయల్దేరాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌ యాజమాన్యం తమ ముఖ్యమైన ఆటగాడికి ఘనంగా వీడ్కోలు పలికింది. తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగా జట్టును వీడుతున్న స్టోక్స్‌కు అపురూపమైన కానుకను అందించింది. ఇటీవల మరణించిన అతని తండ్రి జెడ్ స్టోక్స్ పేరిట జెర్సీని రూపొందించి అతన్ని సర్‌ప్రైజ్‌ చేసింది. స్టోక్స్‌ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేసింది.

    ఇదిలా ఉంటే, స్టోక్స్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ను వీడి వెళ్లడానికి అస్సలు ఇష్టంలేదని, సర్జరీ అనివార్యం కావడంతో అతను బలవంతంగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. తొలుత అతను జట్టుతో పాటే ఉండి సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని, ఇదే విషయాన్ని ఫ్రాంచైజీకి తెలుపగా, వారు కూడా సమ్మతం వ్యక్తం చేశారని ఆర్‌ఆర్‌ యాజమాన్యం అధికారి ఒకరు తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్‌ తప్పనిసరి కాబట్టి స్టోక్స్‌ స్వదేశానికి బయల్దేరక తప్పలేదని ఆయన పేర్కొన్నాడు.

    స్టోక్స్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "సర్జరీ అనివార్యం కావడంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో నీ మెరుపుల్ని మిస్సవుతాం" అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, "అవును డ్యూడ్‌. నువ్వు రాజస్థాన్‌కు మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌వి. టేక్‌ కేర్‌" అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కూడా స్టోక్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తోనే కొనసాగాలని అభిమానులు భారీ ఎత్తున ట్వీట్లు చేశారు. అయితే, 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఇప్పటి వరకు 31 మ్యాచ్‌ల్లో 604 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 16 వికెట్లు తీశాడు. ఇక, ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి నెగ్గి.. మరొకటి ఓడింది. ఈసీజన్ లో రాయల్స్ ను సంజూ శామ్సన్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇవాళ ముంబై వేదికగా జరగనున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్.
    Published by:Sridhar Reddy
    First published: