PBKS vs RR: వావ్.. వాటే మ్యాచ్.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిచిన రాయల్స్.. చేజేతులా ఓడిన పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం (PC: IPL)

ఐపీఎల్ 2021లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్బుతమైన విజయాన్ని అందుకున్నది. పంజాబ్ విజయానికి చివరి రెండో ఓవర్లలో 8 పరుగులు కావల్సిన దశలో రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. కేవలం ఐదు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో రాయల్స్ విజయం సాధించింది.

  • Share this:
    టీ20 క్రికెట్‌లోని (T20 Cricket) అసలు మజాను మరోసారి ఐపీఎల్ (IPL 2021) మ్యాచ్ రుచి చూపించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) 2 పరుల తేడాతో అద్బుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగులు దాటుతుంది అనుకుంటే పంజాబ్ బౌలర్లు 185కే కట్టడి చేశారు. ఇక 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ తగ్గకుండా ధాటిగా ఆడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తమ అద్భుత ఫామ్‌ను కంటిన్యూ చేశారు. మొదటి నుంచి ధాటిగా ఆడిన ఓపెనర్లు తొలి వికెట్‌కు ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఎడా పెడా బాదేస్తూ పరుగులు రాబట్టారు. మధ్యలో అవుటయ్యే అవకాశాలు వచ్చినా రాయల్స్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయారు. ఈ క్రమంలో అర్ద సెంచరీకి దగ్గరైన కెప్టెన్ కేఎల్ రాహుల్ (49) చేతన్ సకారియా బౌలింగ్‌లో కార్తీక్త్ త్యాగికి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ద సేపటికే అర్ద సెంచరీ పూర్తి చేసుకొని దూకుడు మీద ఉన్న మయాంక్ అగర్వాల్ (67) రాహుల్ తెవాతియా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

    ఆ తర్వాత మార్క్‌రమ్, నికొలస్ పూరన్ కలసి అదే దూకుడును కొనసాగించారు. పంజాబ్ కింగ్స్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అందరూ భావంచారు. అయితే కార్తీక్ త్యాగీ, ముస్తఫిజుర్ రెహ్మాన్ మ్యాజిక్ చేశారు. చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు రావల్సి ఉండగా ముస్తఫిజుర్ రెహ్మాన్ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్‌లో 4 పరుగులు కొట్టాల్సి ఉండగా కార్తీక్ త్యాగీ మ్యాజిక్ చేశాడు. ఆఖరి ఓవర్ మూడో బంతికి నికొలస్ పూరన్ (32), ఐదో బంతికి దీపక్ హుడా (0)ను అవుట్ చేశాడు. చివరి బంతికి 3 పరుగులు కావల్సి ఉండగా డాట్ బాల్ వేశాడు. మొత్తానికి ఆఖరి ఓవర్లో కేవలం ఒక పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.







    తొలుత చూడటానికి ఈ మ్యాచ్ బ్యాట్స్‌మెన్ హవా కొనసాగినా.. డెత్ వోవర్లలో బౌలర్లదే పై చేయి అయ్యింది. రాజస్థాన్ జట్టు 200 పరుగులు దాటకుండా పంజాబ్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేశారు. ఇక విజయానికి చేరువైన పంజాబ్ కింగ్స్‌ను రాజస్థాన్ బౌలర్లు అడ్డుకొని అద్బుత విజయం సాధించారు. ఈ పరాజయంతో పంజాబ్ కింగ్స్ తమ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకున్నది.
    Published by:John Naveen Kora
    First published: