PBKS vs RR: ధాటిగా ఆరంభించి.. చివర్లో చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

పంజాబ్ కింగ్స్‌కు 186 పరుగుల టార్గెట్ సెట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ (PC: IPL)

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధీటుగా బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ చివర్లో చేతులెత్తేసింది. కనీసం 220 పరుగులు చేస్తుందని భావించినా పంజాబ్ కింగ్స్ బౌలర్లు డెత్ వోవర్లలో కట్టుదిట్టంగా బంతులు విసరడంతో 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్ ఎవిన్ లుయీస్, యశస్వి జైస్వాల్ కలసి ధాటిగా ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు వేసిన బంతులను బౌండరీలు, సిక్సులకు తరలించారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఎవిన్ లుయీస్ అవుటవడంతో వీరిద్దరి జోడీకి తెరపడింది. కెప్టెన్ సంజూ శాంసన్ (4) నిరాశ పరిచాడు. అయితే మరో ఎండ్‌లో ఎన్న యశస్వి తన దూకుడు కొనసాగించాడు. లియామ్ లివింగ్‌స్టోన్‌తో కలసి మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. భారీ షాట్‌కు యత్నించి లియామ్ లివింగ్ స్టోన్ (25) ఫాబ్ అలెన్ పట్టిన అద్బుతమైన క్యాచ్‌కు అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మహిపాల్ లామ్రోర్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. యశస్వి, లామ్రోర్ కలసి ఆడుతున్న తీరు చూసి రాజస్థాన్ రాయల్స్ 220 పరుగులు దాటేస్తుందని అందరూ భావించారు.

    అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ధీటిగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ (49), లామ్రోర్ (43)లను అవుట్ చేశారు. లామ్రోర్ కేవలం 17 బంతుల్లోనే 43 పరుగులతో జోరుమీద ఉండగా అవుటయ్యాడు. ఆ తర్వాత ఎవరూ సరైన స్కోర్ సాధించలేదు. రియాన్ పరాగ్ (4), రాహుల్ తెవాతియ (2), క్రిస్ మోరిస్ (5), చేతన్ సకారియా (7), కార్తీక్ త్యాగీ (1) తక్కువ పరుగులకే అవుటయ్యారు. టాపార్డర్ రాణించినా మిడిల్, లోయర్ ఆర్డర్ చేతులెత్తేయడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీయం 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

    Emma Raducanu: లండన్ ఫ్యాషన్ వీక్‌లో అందాలతో అలరించిన యూఎస్ ఓపెన్ విజేత ఎమ్మా రాడుకాను








    రాజస్థాన్ రాయల్స్‌ను డెత్ వోవర్లలో కట్టడి చేయడంలో అర్ష్‌దీప్ సింగ్ విజయం సాధించాడు. ఏకంగా 5 వికెట్లు తీసి రాజస్థాన్‌ను అడ్డుకున్నాడు. ఇక సీనియర్ పేసర్ మహ్మద్ షమి తక్కువ పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కేవలం దీపక్ హుడా మాత్రమే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ విజయానికి 20 ఓవర్లలో 186 పరుగులు చేయాల్సి ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: