• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RAHUL TEWATIA FAILS FITNESS TEST AHEAD OF T20I SERIES AGAINST ENGLAND SA

రాహుల్ తెవాటియాకు బ్యాడ్‌న్యూస్.. అతని ఆశలపై నీలినీడలు

రాహుల్ తెవాటియాకు బ్యాడ్‌న్యూస్.. అతని ఆశలపై నీలినీడలు

సర్దిచెప్పుతున్న వార్నర్ (Image:IPL)

రాహుల్ తెవాటియా ట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు కోసం బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించగా అతను అధికారులను సంతృప్తి పరచలేదని సమాచారం

  • Share this:
    రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా ట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు కోసం బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించగా అతను అధికారులను సంతృప్తి పరచలేదని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే మెుదటి సారిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలన్న అతని ఆశలపై గల్లంతైనట్లే.. ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శనతో ఆదరగొట్టిన తెవాటియా.. ఆ ప్రదర్శన అధారంగా అతన్ని ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపీక చేయాలని భావించింది. విండీస్‌ బౌలర్‌ కాట్రెల్‌పై వరుసగా 5 సిక్సర్లు బాది తెవాటియా.. ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపీక చేయాలని టీమిండియా మెనేజ్‌మెంట్ అనుకుంది.

    ఇందులో భాగంగా తెవాటీయాకు నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. యోయో టెస్ట్‌లో 17.1 పాయింట్లు సాధించడం.. 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగెత్తడం వంటి విభాగాలలో రాహుల్ విఫలమయ్యాడు. అతనితో పాటు గత ఆసీస్ టూర్ సమయంలో ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైన వరుణ్ చక్రవర్తి మరోసారి కూడా విఫలమైనట్లు తెలుస్తోంది.
    Published by:Rekulapally Saichand
    First published: