news18-telugu
Updated: December 21, 2019, 11:44 AM IST
తండ్రికి తగ్గ తనయుడు... డబుల్ సెంచరీ బాదిన ద్రవిడ్ కొడుకు సమిత్
కర్ణాటకలో జరిగిన అండర్ -14 రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీ చేసి సెన్సేషన్ సృష్టించాడు... భారత మాజీ కెప్టెన్, రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్. మనకు తెలుసు రాహుల్ ద్రవిడ్‌ను భారత టెస్ట్ క్రికెట్లో మిస్టర్ వాల్, వాల్ ఆఫ్ ది టీమ్ అని పిలుస్తారని. ఎందుకంటే... ద్రవిడ్ క్రీజ్‌లోకి వచ్చాడంటే చాలు... ఎంత మంది బౌలింగ్ వేసినా... ఔట్ అవ్వనే అవ్వడు. చివరకు బాల్స్ వేసీ, వేసీ అలసిపోయిన చరిత్ర బౌలర్లది. ఇలా జట్టు కెప్టెన్‌గా, అద్భుత బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా ద్రవిడ్ మర్చిపోలేని సేవలు అందించాడు. ఇప్పుడు కూడా టీమిండియా జూనియర్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. తాజాగా ద్రవిడ్ కొడుకు సమిత్ కొంతకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి నుంచీ ఆటలో మెలకువలన్నీ తెలుసుకున్నాడు. ఢిల్లీలో అండర్ 14 రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీ బాదేశాడు.
వైస్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టులో చోటు దక్కించుకున్న సమిత్... ధార్వాడ్ జోన్లో డబుల్ సెంచరీ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సుమిత్ 201 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఫలితంగా సమిత్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Published by:
Krishna Kumar N
First published:
December 21, 2019, 11:44 AM IST