ఏరి కోరి వచ్చిన పదివిని కాదనుకున్న రాహుల్ ద్రావిడ్

రాహుల్ ద్రవిడ్ ( ఫైల్ ఫొటో)

 • Share this:
  టీమిండియాలో ఏ పదవికైన వందల సంఖ్యలో పోటీ ఉంటుంది. ఏ పోస్టుకైనా పైరవీలు సహజం. అలాంటిది మిస్టర్ డిఫెండ‌బుల్‌ రాహుల్ ద్రావిడ్‌ ఏరి కోరి వచ్చిన కాదనుకున్నారు. ఏకంగా టీమిండియా కోచ్ ప‌ద‌విని తిరస్కరించాడ‌ట‌. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. కేవలం తన కుటుంబతో గడపాలన్న ఉద్దేశంతో ద్రావిడ్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు రాయ్ వెల్లడించారు.

  "టీమిండియా పదివిని కోసం రాహుల్‌ను తాము ద్రవిడ్​ను సంప్రదించామని అతను దాన్ని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడన్నారు. కోచ్ బాధ్యతను నిర్వహించాని మేం ద్రవిడ్ అడిగాం. అయితే తను కుటుంబ కారణాల వల్ల ఆ పదివిని వద్దనుకుంటున్నాని, త‌న‌ ఇద్దరి పిల్లలతో గడపాలని, ఇన్నాళ్లూ టీమ్‌తో వివిధ దేశాలలో టూర్ చేయ‌డం వ‌ల్ల వారికి ఎక్కువ స‌మ‌యం ఇవ్వలేక‌పోయాన‌ని,
  కావున ఇప్పుడు కుంటుంబ సభ్యులకే ఎక్కువ సమయం కేటాయించనున్నట్లు ద్రావిడ్ చెప్పిన‌ట్టు" రాయ్ తెలిపారు.

  2017లో అనిల్ కుంబ్లే మధ్యలోనే కోచ్ పదవిని వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో రాయ్ కమిటి అండ‌ర్‌-19 కోచ్‌గా ఉన్న ద్రావిడ్‌ను సంప్రదించింది. రాహుల్ తిరస్కరించడంతో ర‌విశాస్త్రికి బాధ్యయతలు అప్పగించారు.

   
  Published by:Rekulapally Saichand
  First published: