RAHUL DRAVID RESTRICTING THOSE FIVE TEAM INDIAN CRICKETERS TO PARTY WHOLE NIGHT HERE IS THE REASON JNK
Coach Dravid's Rule: ఆ ఐదుగురు తప్ప మిగతా వాళ్లు నైటంతా పార్టీ చేసుకోవచ్చు.. ఆర్డర్ పాస్ చేసిన ద్రవిడ్ సార్
ఆ ఐదుగురు పార్టీ చేసుకోవడంపై ద్రవిడ్ ఆంక్షలు (PC: BCCI)
Rahul Dravid: న్యూజీలాండ్‌పై 3-0తో టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. తొలి సిరీస్‌లోనే ద్రవిడ్ మార్క్ కనిపించింది. ఈ విజయం తర్వాత ఆటగాళ్లు పార్టీ చేసుకోవడానికి ద్రవిడ్ అనుమతి ఇచ్చాడు. అయితే జట్టులోని ఆ ఐదుగురిని మాత్రం వారిస్తున్నాడు.
కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పర్యవేక్షణలో.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit sharma) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా (Team India) క్లీన్ స్వీప్ చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ (Eden Garden) వేదికగా ఆదివారం రాత్రి న్యూజీలాండ్‌తో (New Zealand) జరిగిన 3వ టీ20లో 73 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో వైట్ వాష్ చేసి చాంపియన్‌గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) సూపర్ 12 దశకే ఇండియా పరిమితం అయ్యింది. భారత జట్టు సెమీఫైనల్ చేరకపోవడానికి న్యూజీలాండ్ కూడా కారణం. దీంతో వరల్డ్ కప్ పరాజయానికి టీమ్ ఇండియా ఇలా స్వీట్ రివెంజ్ తీర్చుకున్నది. రవిశాస్త్రి-కోహ్లీ శకం ముగిసిన తర్వాత తొలి సారి పూర్తిగా యువకులతో నిండిన జట్టును రాహుల్ ద్రవిడ్ నడిపించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తొలి మ్యాచ్ నుంచే యువ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తూ.. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రయోగాలు చేశాడు. రోహిత్ శర్మ కూడా పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. రోహిత్ మ్యాచ్ సమయంలో పన్నిన వ్యూహాలకు న్యూజీలాండ్ వద్ద సమాధానమే లేకపోయింది. టీ20 సిరీస్ ముగియడంతో భారత జట్టు మరో మూడు రోజుల్లో టెస్టు సిరీస్‌కు సన్నద్దం అవుతున్నది. ఈ నెల 25 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్నది. టెస్టులకు రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించారు. అలాగే తొలి టెస్టుకు కోహ్లీ కూడా అందుబాటులో ఉండడు. అజింక్య రహానే కెప్టెన్సీలో భారత జట్టు తొలి టెస్టు ఆడనున్నది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23లో ఈ టెస్టు భాగం కాబట్టి ఇరు జట్లుకు ఈ సిరీస్ కీలకం కానున్నది.
ఇక మూడో టీ20 ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సిరీస్ గెలిచిన సంతోషంలో అందరూ ఫుల్‌గా పార్టీ చేసుకోవచ్చని అన్నాడు. అయితే ఆ ఐదుగురు మాత్రం త్వరగా పడుకోవాలని.. మిగతా వాళ్లందరూ రాత్రంతా పార్టీ చేసుకున్న పర్వాలేదన్నాడు. ఎందుకంటే మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న టెస్టులో జట్టులోని ఐదుగురు కూడా ఉన్నారు. టీ20లతో పాటు వాళ్లు టెస్టు జట్టులో సభ్యులు. రాబోయే మూడు రోజులు పార్టీలు అంటూ నిద్ర చెడగొట్టకుండా.. త్వరగా పడుకొని టెస్టులకు ఫ్రెష్‌గా ఉండాలని చెబుతున్నాడు. ఎందుకంటే మ్యాచ్ 9.30కే మొదలవుతుంది కాబట్టి గ్రౌండ్లో 7.30 కల్లా ఉండాలని.. అంటే హోటల్లో చాలా ఎర్లీగా లేవాలని ద్రవిడ్ సూచిస్తున్నాడు.
టీ20 జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టు జట్టులో కూడా ఉన్నారు. ఈ ఐదురురిని దృష్టిలో పెట్టుకొనే ద్రవిడ్ ఆ సూచన చేసినట్లు అర్దమవుతున్నది. బీసీసీఐ దీనికి సంబంధించిన వీడియో కూడా ట్విట్టర్లో పోస్టు చేసింది. మొత్తానికి ద్రవిడ్ ఒకవైపు పార్టీలు చేసుకోమంటూనే రిస్ట్రిక్షన్ పెడుతున్నాడని అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ మాత్రం కమిట్మెంట్ యువకులకు గుర్తు చేయడం బాగుందని మాజీలు అంటున్నారు.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.