Home /News /sports /

Rahul Dravid on duty: అప్పుడే పని మొదలు పెట్టిన ద్రవిడ్.. గత రెండు రోజుల్లో ఏం చేశాడో తెలుసా? ఊపిరి పీల్చుకున్న సీనియర్లు

Rahul Dravid on duty: అప్పుడే పని మొదలు పెట్టిన ద్రవిడ్.. గత రెండు రోజుల్లో ఏం చేశాడో తెలుసా? ఊపిరి పీల్చుకున్న సీనియర్లు

టీమ్ ఇండియా క్రికెటర్లకు హెడ్ కోచ్ ద్రవిడ్ ఫోన్ కాల్స్..

టీమ్ ఇండియా క్రికెటర్లకు హెడ్ కోచ్ ద్రవిడ్ ఫోన్ కాల్స్..

Rahul Dravid: టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంకా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టక ముందే తన పని మొదలు పెట్టాడు. జట్టులోని క్రికెటర్లందరికీ కాల్స్ చేసి వారి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నాడు.

    టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) శైలే వేరు. క్రికెటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న సమయం నుంచి ఇవాళ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా (Head Coach) మారే వరకు అతడు నమ్మిన ఒకే ఒక సిద్దాంతం.. పర్ఫెక్షన్. ప్రతీ పనిలోనూ తనదైన మార్క్ కనపడేలా చూసుకుంటాడు. నూటికి నూరు శాతం తాను నమ్మితేనే దాన్ని ఆచరణలో పెడతాడని సన్నిహితులు చెబుతుంటారు. టీమ్ ఇండియాకు కోచ్‌గా చానాళ్ల క్రితమే అవకాశం వచ్చినా కాదనుకున్నాడు. ఇండియా ఏ, ఇండియా అండర్ 19 జట్లకు కోచ్‌గా పని చేస్తూ భారత భవిష్యత్ క్రికెటర్లను రూపొందించాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) డైరెక్టర్‌గా పని చేస్తూ సీనియర్ల టెక్నిక్ లోపాలను సరిదిద్దాడు. కేవలం క్రికెట్ లోపాలను సరి చేయడం, వారికి మంచి శిక్షణ ఇవ్వడం వంటి వాటికే పరిమితం కాకుండా ప్రతీ ఆటగాడి మానసిక బలాన్ని అంచనా వేస్తాడని ద్రవిడ్‌కు పేరున్నది. ఏ ఆటగాడి మానసిక స్థితి ఎలా ఉందో ద్రవిడ్ చాలా త్వరగా గుర్తించగలడని సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి ద్రవిడ్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడటంతో అందరి అంచనాలు పెరిగిపోయాయి.

    ఇప్పటి వరకు ఉన్న టీమ్ ఇండియా ఒక ఎత్తైతే.. రాహుల్ హయాంలో ఉండబోయే జట్టు మరో లెవెల్‌లో ఉంటుందని అంటున్నారు. రాహుల్ ద్రవిడ్ కూడా అందరి అంచనాలను అందుకునే పనిలో పడ్డాడు. రాహుల్ ద్రవిడ్ సేవలు న్యూజీలాండ్‌తో జరుగనున్న సిరీస్ నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ గత మూడు రోజులుగా రాహుల్ ద్రవిడ్ జట్టులోని ప్రతీ ఆటగాడితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తున్నది. అధికారికంగా బాధ్యతలు చేపట్టక ముందే అతడు జట్టులో ఆటగాళ్ల మానసిక స్థితి, బలాబలాలపై ఒక అంచనాలు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కెప్టెన్ కోహ్లీ నుంచి మొదలుకొని ప్రతీ ఆటగాడికి ద్రవిడ్ ఫోన్ చేసినట్లు సమాచారం.

    Disha Oberai: క్రికెట్ షోలతో అదరగొడుతున్న దిశ ఒబెరాయ్.. ఆమె గురించి మీకు తెలియని నిజాలు ఇవే


    ప్రస్తుతం వారి మానసిక, శారీరిక స్థితి ఎలా ఉన్నదో ద్రవిడ్ తెలుసుకున్నాడు. గత కొన్నాళ్లుగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్నందున.. విశ్రాంతి ఏమైనా కోరుకుంటున్నారా అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అవసరం అయితే విశ్రాంతి తీసుకోవాలని.. ఎక్కువగా శ్రమ పడవద్దని సూచించినట్లు తెలుస్తున్నది. తాను రావడంతోనే అందరు యువ క్రికెటర్లు జట్టులోకి వచ్చేస్తారని అనుకుంటున్నారని... కానీ తాను అలా చేయబోవడం లేదని కూడా చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరి స్థానానికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తున్నది. రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం జట్టులోని అందరితో మాట్లాడిన అనంతరమే.. కొంత మంది న్యూజీలాండ్ సిరీస్‌‌కు విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాతే బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన భరోసాతో సీనియర్లు కూడా ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, India vs newzealand, Rahul dravid, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు