Rahul Dravid : : " బీ అలర్ట్.. రాహుల్ ద్రావిడ్ వస్తున్నాడు.. మిగిలిన దేశాలు జాగ్రత్తగా ఉండాల్సిందే.."

Rahul Dravid

Rahul Dravid : టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి హెడ‌కోచ్‌గా బాధ్యతలు తీసుకునే రాహుల్ ద్రావిడ్, 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.

 • Share this:
  ఊహించిందే జరిగింది. అందరూ ఊహించినట్టుగానే టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా మిస్టర్ వాల్ ద్రావిడ్ (Rahul Dravid) ఎంపికయ్యాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ (T-20 World Cup 2021) తో ప్ర‌స్తుత కోచ్ ర‌విశాస్త్రి (Ravi Shastri) పదవీ కాలం ముగియనుంది. ఈ మెగాటోర్నీ తర్వాత అతను త‌ప్పుకోనుండ‌టంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ(BCCI) నానా తంటాలు పడింది. ఈ ప‌ద‌విపై ఎంతో మంది విదేశీయులు ఆస‌క్తిగా ఉన్నా.. బీసీసీఐ మాత్రం ఓ ఇండియ‌న్‌కే అప్ప‌గించాల‌ని భావించింది. ఆ దిశగా అడుగులేసింది. చివరికి అనుకున్నది సాధించింది బీసీసీఐ. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి హెడ‌కోచ్‌గా బాధ్యతలు తీసుకునే రాహుల్ ద్రావిడ్, 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్, ఆ పదవికి రాజీనామా సమర్పించబోతున్నారు. అలాగే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీ కాలం కూడా ముగియనుండడంతో అతని స్థానంలో భారత మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్‌సీఏలో రాహుల్ ద్రావిడ్‌తో పాటు పరాస్ మాంబ్రే బౌలింగ్ శిక్షకుడిగా కొనసాగుతున్నారు.

  ఇక, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ని నియమిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అండర్19 కోచ్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ అయిన ద్రావిడ్ శిక్షణలో భారత్ మరింత దృఢంగా, పటిష్టంగా మారుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

  రాహుల్ ద్రావిడ్‌ను కోచ్‌గా నియమిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. " టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం నిజమైతే... మిగిలిన దేశాలన్నీ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాల్సిందే... " అంటూ ట్వీట్ చేశాడు మైకెల్ వాన్


  రెండేళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా రాహుల్ ద్రావిడ్ కు భారీ మొత్తం అందనుంది. మిస్టర్ వాల్ రూ.10 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నాడు. ఇక ఈ సారి కోచ్ ఎంపిక విష‌యంలో కెప్టెన్ కొహ్లీ అభిప్రాయాల‌ను కూడా పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు బీసీసీఐ. ఇది వ‌ర‌కూ కోచ్ ఎంపిక‌లో కొహ్లీనే కీల‌క పాత్ర పోషించాడు.

  కుంబ్లే ఆ బాధ్య‌త‌ల నుంచి వైదొల‌గ‌డానికి కార‌ణం కోహ్లీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే త‌న‌కు అన్ని ర‌కాలుగానూ సెట్ అవుతాడ‌నే ర‌విశాస్త్రిని కోచ్ గా వ‌చ్చేలా కొహ్లీ చూసుకున్నాడ‌నే మాట కూడా వినిపించింది. అయితే ఇప్పుడు కోహ్లీ మాట గ‌తంలాగా చెల్లుబాటు అయ్యే అవ‌కాశాలు లేవు.

  ఇది కూడా చదవండి : ధోనీ మరోసారి తండ్రి కాబోతున్నాడా..? వైరలవుతున్న సాక్షి ఫోటో..!

  ఇప్ప‌టికే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న‌ట్టుగా కోహ్లీ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. అయితే వ‌న్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా కొహ్లీని త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ద్రావిడ్ ను కోచ్ గా ఎంపిక చేయ‌డంలో కూడా బీసీసీఐ పెద్ద‌ల నిర్ణ‌యమే ఫైన‌ల్ అవుతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది.
  Published by:Sridhar Reddy
  First published: