Home /News /sports /

Rahul Dravid Plan: రాహుల్ ద్రవిడ్ 5 పాయింట్ల ప్లాన్.. కరెక్ట్‌గా అమలైతే టీమ్ ఇండియాను కొట్టే వాడు ఉండడు

Rahul Dravid Plan: రాహుల్ ద్రవిడ్ 5 పాయింట్ల ప్లాన్.. కరెక్ట్‌గా అమలైతే టీమ్ ఇండియాను కొట్టే వాడు ఉండడు

రాహుల్ ద్రవిడ్ రూపొందించిన 5 పాయింట్ల టెంప్లేట్ ఏంటి?

రాహుల్ ద్రవిడ్ రూపొందించిన 5 పాయింట్ల టెంప్లేట్ ఏంటి?

Rahul Dravid: టీమ్ ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ సరికొత్త 5 పాయింట్ ఫార్ములాను ప్రతిపాదించాడు. తాను ఒకటి రెండు సిరీస్‌లు గెలిపించడానికి రాలేదని.. సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రయోజనం చేకూరే వ్యూహాలతో వచ్చినట్లు ఈ టెంప్లేట్‌తో అర్దం అయిపోతున్నది.

ఇంకా చదవండి ...
  టీమ్ ఇండియా (Team India) హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul dravid) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ (17.11.2021) తొలి మ్యాచ్ న్యూజీలాండ్‌తో (New Zealand) ఆడనున్నది. కీలకమైన టీ20 సిరీస్‌కు ముందు ద్రవిడ్ తొలిసారిగా కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఇందులో ఇరువురు అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్ తన దీర్ఘ కాలిక ప్రణాళిక గురించి క్లుప్తంగా వివరించాడు. ప్రతీ సిరీస్‌కు కొత్త వ్యూహాలు రచించడం కాకుండా.. దీర్ఘకాలికంగా జట్టుకు ఉపయోగపడే గేమ్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022) ప్రారంభానికి మరో ఏడాది సమయం ఉన్నది. అందుకు తగిన సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ద్రవిడ్ చెప్పాడు. ఇందుకోసం 5 పాయింట్లతో కూడిన ఒక విధానాన్ని కూడా రూపొందించాడు. ఆ విషయాలన్నింటినీ సరిగ్గా అమలు చేయగలిగితే భారత జట్టు సత్ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదు.

  ద్రవిడ్ రూపొందించి టెంప్లేట్‌లో తొలి పాయింట్ భయం లేని క్రికెట్ ఆడటం. ఇటీవల కాలంలో టీమ్ ఇండియాను పరిశీలిస్తే చాలా రక్షణాత్మక ధోరణిలో క్రికెట్ ఆడుతున్నది. టీ20 ఫార్మాట్‌లో కూడా వన్డే తరహా క్రికెట్ ఆడుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓటములకు ఇలాంటి రక్షణాత్మక క్రికెట్టే ప్రధాన కారణం. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని ద్రవిడ్ భావిస్తున్నాడు. క్రికెటర్లు సమానుకలంగా ఆడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. అవసరం అయితే రిస్క్ తీసుకొని డైనమిక్ క్రికెట్ ఆడేలా ప్రోత్సహించనున్నాడు. ఎలాంటి భయం లేకుండా ఎటాకింగ్ క్రికెట్ ఆడేలా క్రికెటర్లను తయారు చేయనున్నాడు.

  Team India: టీమ్ ఇండియా క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? వీరిలో సీక్రెట్ లవర్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా?


  ఇక గత కొంత కాలంగా భారత జట్టు నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నది. స్వదేశీ సిరీస్‌లు విదేశీ పర్యటనలు ఐపీఎల్‌తో క్రికెటర్లు చాలా అలసి పోతున్నారు. బిజీ క్రికెట్‌కు తోడు బయోబబుల్ కారణంగా ఆటగాళ్లు శారీరికంగానే కాకుండా మానసికంగా కూడా అలసి పోతున్నారు. అందుకే టీమ్ ఇండియాలో రొటేషన్ పాలసీని అమలు చేయాలని ద్రవిడ్ భావిస్తున్నాడు. ప్రతీ సిరీస్ తర్వాత కొంత మంది క్రికెటర్లకు విశ్రాంతిని ఇవ్వడం ద్వారా వాళ్లు తిరిగి ఫ్రెష్‌గా మరో సిరీస్ కోసం సిద్దంగా ఉంటారని ద్రవిడ్ ఆలోచన. సాధ్యమైనంత త్వరలోనే ఈ విధానం అమలులోకి రానున్నది. దీని వల్ల కొందరిపైనే పని భారం పడకుండా కూడా చూడవచ్చు.

  ఇక జట్టులో ప్రతీ ఒక్కరికి తమ పాత్ర ఏమిటో స్పష్టంగా తెలియజేయాల్సి ఉన్నది. జట్టు తరపున ఏ ఆటగాడు ఏం చేయాలన్నది ముందుగానే చెబితే దాని మీదే ఫోకస్ ఉంటుంది. అదే సమయంలో సందర్భాన్ని బట్టి తమను తాము మౌల్డ్ చేసుకునేలాగ కూడా ఆటగాళ్లను తయారు చేయాలని భావిస్తున్నాడు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన సమయంలో కూడా కెప్టెన్ రోహిత్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ప్రతీ జట్టులోనూ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. మా జట్టులో కూడా ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఎవరి పాత్రలో వాళ్లు ఒదిగిపోతాము అని అన్నాడు.

  Target Olympics: అమెరికాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం వెనుక ఐసీసీ పెద్ద ప్లాన్.. ఒలింపిక్స్ చోటు కోసమేనా?
  ద్రవిడ్ అనుసరించాలని భావిస్తున్న పాయింట్లలో ఇది అతి ముఖ్యమైనది. ప్రతీ ఆటగాడు జట్టే ప్రధానంగా ఆడేలా చూడాలని అనుకుంటున్నాడు. జట్టు కంటే ఆటగాడు ముఖ్యమైన వాడు కాదు. వ్యక్తిగత రికార్డులు, ప్రతిష్ట కోసం ఆడకుండా.. జట్టు ప్రయోజనాల కోసం ఆడేలా తీర్చిదిద్దనున్నాడు. గతంలో ఇండియా ఏ, అండర్ 19 కోచ్‌గా ఉన్నప్పుడు ద్రవిడ్ ఇలాంటి పాఠాలనే బోధించి మంచి రిజల్ట్ తీసుకొని వచ్చాడు. రాహుల్ ద్రవిడ్ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేశాడు. ఈ విషయంలో కచ్చితంగా ద్రవిడ్ కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నాడు.

  ఇక చివరి పాయింట్ అయినా చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రతీ ఒక్క ఆటగాడికి తన కెరీర్‌పై భరోసా పెంచాలా. గతంలో ఒక ఆటగాడు ఏ మ్యాచ్‌లో ఉంటాడో .. ఏ మ్యాచ్‌కు పక్కకు పెడతారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇకపై ప్రతీ ఆటగాడికి సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చి అతడి కెరీర్‌కు భరోసా కల్పించనున్నాడు. దాని వల్ల టీమ్ ఇండియా కెరీర్ కూడా మరింత ముందుకు వెళ్తుందని ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ 5 పాయింట్లు కనుక కచ్చితంగా అమలు జరిగితే టీమ్ ఇండియా భవిష్యత్‌లో మరింత పటిష్టమైన జట్టుగా తయారవడం ఖాయమే.
  Published by:John Kora
  First published:

  Tags: KL Rahul, Rahul dravid, Rohit sharma, Team india

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు