Home /News /sports /

RAHUL DECIDED TO CONTINUE AS NAC CHIEF BATTING COACH VIKRAM RATHOD NOW BECAME FIRST CHOICE FOR HEAD COACH JNK

Team India Next Coach: టీమ్ ఇండియా కోచ్ రేసు నుంచి తప్పుకున్న రాహుల్ ద్రవిడ్.. నెక్ట్ప్ కోచ్ రేసులో ఉన్నది కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్?

టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసులో కొత్త పేరు.. రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో అతడికే అవకాశం? (PC: BCCI)

టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసులో కొత్త పేరు.. రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో అతడికే అవకాశం? (PC: BCCI)

రవిశాస్త్రి తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అవుతాడని అందరూ భావించారు. కానీ ద్రవిడ్ ఎన్ఏసీ చీఫ్‌గా కొనసాగడానికి నిర్ణయించుకోవడంతో హెడ్ కోచ్ పదవికి మరొక పేరు తెరపైకి వచ్చింది. అతడు రవిశాస్త్రి వారసుడిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని పలువురు అంటున్నారు.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) హెడ్‌ కోచ్ రవిశాస్త్రి (Head Coach) పదవీ కాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగిసిపోనున్నది. టీ20 వరల్డ్ కప్ (T20 World cup) తర్వాత తన పదవీ కాలం ముగుస్తున్నదని.. ఇకపై ఆ పదవిలో కొనసాగబోవడం లేదని రవిశాస్త్రి తేల్చి చెప్పాడు. దీంతో భారత జట్టు తర్వాతి కోచ్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) (NAC) చీఫ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)  ఫస్ట్ టర్మ్ త్వరలో ముగియనున్నది. దీంతో రవిశాస్త్రి తర్వాత అతడే టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని అందరూ భావించారు. శ్రీలంక వెళ్లిన భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వెళ్లడంతో అతడు నెక్ట్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమనే అనుకున్నారు. కానీ మూడు రోజుల క్రితం రాహుల్ ద్రవిడ్ మరోసారి ఎన్ఏసీ చీఫ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాహుల్ ద్రవిడ్ కేవలం ఒక టర్మ్ మాత్రమే ఎన్ఏసీ డైరెక్టర్‌గా బాధ్యతలు పూర్తి చేసుకున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాహుల్ ద్రవిడ్ మరో టర్మ్ (రెండేళ్లు) పని చేసే అవకాశం ఉన్నది. ద్రవిడ్ మరోసారి ఎన్ఏసీ చీఫ్ పోస్టుకు దరఖాస్తు చేయడంతో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసు నుంచి తప్పుకున్నట్లైంది.

    ఇక ద్రవిడ్ తప్పుపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ఎవరిని ఎంపిక చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత జట్టు ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ (Vikram Rathod) హెడ్ కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రవిశాస్త్రి వారసుడిగా విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఇంగ్లాండ్‌లో ఉన్న విక్రమ్ రాథోడ్‌తో బీసీసీఐ పెద్దలు కూడా మాట్లాడినట్లు సమాచారం. ప్రముఖ రచయిత, క్రీడా విశ్లేషకుడు విజయ్ లోకపల్లి కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాడు. 'టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసులో విక్రమ్ రాథోడ్ ముందు వరుసలో ఉన్నాడు. ఇది మంచి ఎంపిక' అని ఆయన ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. ద్రవిడ్ రేసు నుంచి తప్పుకోవడం.. ప్రస్తుతం జట్టుతో పాటు పని చేస్తున్న విక్రమ్ రాథోడ్‌నే హెడ్ కోచ్ చేయాలని బోర్డులోని కొంత మంది కూడా అనుకుంటుండటంతో అతడి అభ్యర్థిత్వంపై బలం చేకూరుతున్నది.





    టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా రోహిత్ శర్మ, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా వంటి క్రికెటర్లకు రాథోడ్ చాలా సన్నిహితంగా మెలుగుతుంటాడు. యువ క్రికెటర్ల బ్యాటింగ్ లోపాను సరి చేయడంలో కూడా రాథోడ్ ముఖ్య భూమిక పోషించినట్లు తెలుస్తున్నది. మరోవైపు కోహ్లీకి కూడా చాలా క్లోజ్ కాబట్టి అతడు కూడా రాథోడ్ పేరును బలపర్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ భంగర్ భారత జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ పదవి చేపట్టాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆశీస్సులు కూడా రాథోడ్‌కు ఉన్నాయి. ఇన్ని సానుకూల అవకాశాల నడుమ రాథోడ్ తర్వాతి కోచ్ అవుతాడని పలువురు భావిస్తున్నారు. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ నెగ్గడం, స్వదేశంలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించడం వెనుక రాథోడ్ కృషి ఉన్నది. అటు సీనియర్లతోనే కాకుండా జూనియర్లతో కూడా విక్రమ్ రాథోడ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో రాథోడ్ హెడ్ కోచ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Rahul dravid, Ravi Shastri, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు