US Open Men's Final 2019 : సాధారణంగా క్రీడాకారుల్లో ఏజ్ పెరిగే కొద్దీ... పోరాట పటిమ తగ్గిపోతుంది. కానీ... స్పెయిన్ బుల్, ప్రపంచ రెండో ర్యాంకర్ రఫెల్ నాదల్ మాత్రం... అలుపెరుగని పోరాటం చేసి... యూఎస్ ఓపెన్ ఫైనల్లో ప్రత్యర్థిని చిత్తుచేసి... ఛాంపియన్‌గా నిలిచాడు. కెరీర్లో 19వ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రఫెల్ నాదల్... రష్యాకి చెందిన ఐదో సీడ్ డానిల్ మెద్వదేవ్ మధ్య... ఫైనల్ పోరు... ఏకంగా 4గంటల 50 నిమిషాల పాటూ సాగింది. రఫెల్ నాదల్... 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
THIS is what it means ❤@RafaelNadal | #USOpen pic.twitter.com/EIhwpzXaVq
— US Open Tennis (@usopen) September 9, 2019
టైటిల్ పోరులో నాదల్... కొత్త బాల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా మొదట్లో తను తడబడ్డాడు. కానీ... గంటలు గడిచేకొద్దీ అద్భుత పోరాట పటిమ చూపించాడు. రఫాను ఎలాగైనా మట్టికరిపించాలనే ఉద్దేశంతో... మెద్వదేవ్ కూడా గట్టిగానే పట్టుబిగించాడు. ఐతే... రఫా ఫ్యాన్స్ అతనిలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. టెన్నిస్ కోర్టులో రఫా... రఫా అంటూ నినాదాలు హోరెత్తాయి. ఆ జోష్‌లో స్పెయిన్ బుల్ రంకెలేశాడు. మెద్వదేవ్‌పై బలమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా మరోసారి అతనికి చిరస్మరణీయమైన విజయం సొంతమైంది.
Humor.
Adulation.
Respect.
Congratulations on a remarkable two weeks, @DaniilMedwed!#USOpen pic.twitter.com/oKOkmboQTc
— US Open Tennis (@usopen) September 9, 2019
నిజానికి ఈసారి అమెరికా గడ్డపై స్పెయిల్ బుల్ జైత్రయాత్ర సాగింది. చిరకాల ప్రత్యర్థులు, తనకు పోటీ కాగల ఇద్దరు స్టార్లు జొకోవిచ్, ఫెడరర్ ముందుగానే తప్పుకోవడంతో నాదల్కు ఎదురులేకుండా పోయింది. ఐతే... తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టిన మెద్వెదేవ్ నుంచి మాత్రం ఊహించనంత ఎదురుదాడి కనిపించింది. ఐతే... ఇందులో ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు క్రీడా నిపుణులు... ఎందుకంటే... ఈ ఏడాది అత్యధిక విజయాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 50 విజయాలతో మెద్వెదేవ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. నాదల్ 46 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అతను 47వ విజయం సాధించినట్లైంది. ఇటీవల రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ ఫైనల్లో కూడా మెద్వెదేవ్పై గెలిచి నాదల్ టైటిల్ సాధించాడు. నాదల్ కెరీర్లో ఇది 27వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. దీంతో కలిపి ఇప్పటివరకూ అతను 19 ఫైనల్స్‌లో గెలిచి, 8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rafael Nadal, Us open 2019