అమెరికన్ ఓపెన్‌లో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్ జోరు కొనసాగుతోంది.మెన్స్ సింగిల్స్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్పానిష్ బుల్ రఫాల్ నడాల్ సులువుగా థర్డ్ రౌండ్ చేరాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో నడాల్..ప్రత్యర్ధి డేవిడ్ ఫెర్రర్ రెండో సెట్ మధ్యలోనే గాయం కారణంగా రిటైరవ్వడంతో నడాల్‌కు నేరుగా రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.సెకండ్ సెట్లోనూ టాప్ సీడ్ నడాల్‌కు పోటీనే లేకుండా పోయింది. రెండో రౌండ్ పోరులో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణించి టైటిల్ వేటలో నిలిచాడు.
స్విట్జర్లాండ్ ప్లేయర్ వాసెక్ పోస్పిసిల్ను మూడు వరుస సెట్లలో ఓడించాడు. అన్సీడ్గా బరిలోకి దిగిన పోస్పిసిల్ స్పానిష్ బుల్ దూకుడు ముందు తేలిపోయాడు. 6-3తో తొలి సెట్ నెగ్గి శుభారంభం చేశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లు,పవర్ఫుల్ సెర్వ్లు,క్రాస్ కోర్ట్ షాట్లతో చెలరేగి ఆడి ప్రత్యర్ధిపై ఆధిపత్యం ప్రదర్శించాడు.6-4తో సెకండ్ సెట్ సైతం నెగ్గి మ్యాచ్‌పై పట్టుబిగించాడు.మూడో సెట్లోనూ రాఫా జోరు కొనసాగింది.ప్రత్యర్ధికే ఏ మాత్రం అవకాశమివ్వకుండా పూర్తి స్థాయిలో డామినేట్ చేశాడు.6-2తో మూడో సెట్ కూడా సొంతం చేసుకుని థర్డ్ రౌండ్‌కు దూసుకెళ్లాడు.మూడో రౌండ్లో 27వ సీడెడ్ రష్యన్ ప్లేయర్ కరెన్ ఖచెనోవ్తో పోటీపడతాడు.2017 అమెరికన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన నడాల్...మూడు సార్లు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాఫా ఇదే స్పీడ్ కొనసాగిస్తే నాల్గవ సారి ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ఖాయం.ప్రస్తుతం ఏటీపి వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ప్లేస్‌లో ఉన్న స్పానిష్ బుల్ ఈ టైటిల్ నెగ్గితే 18 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తాడు. ఇదే జరిగితే ఫెదరర్ తర్వాత మోడ్రన్ టెన్నిస్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మార్క్ దాటిన ఘనత నడాల్కే దక్కుతుంది.
🇪🇸💪🎾☄️@RafaelNadal defeats
Pospisil 6-3, 6-4, 6-2 under the lights in Arthur Ashe Stadium to reach R3!https://t.co/OS9bRlDlWE#USOpen pic.twitter.com/oBManCMrVY
— US Open Tennis (@usopen) August 30, 2018
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tennis, US Open 2018