యూఎస్ ఓపెన్: 'నడాల్‌'కే చెమటలు పట్టించిన డొమినిక్ తీమ్

స్పానిష్ బుల్ రఫాల్ నడాల్‌,ఆస్ట్రియన్ స్టార్ డొమినిక్ తీమ్‌‌ మధ్య జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ సమరం టెన్నిస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఐదు సెట్లలో ఐదు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోటీ ప్రస్తుత అమెరికన్ ఓపెన్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది.

news18-telugu
Updated: September 5, 2018, 5:42 PM IST
యూఎస్ ఓపెన్: 'నడాల్‌'కే చెమటలు పట్టించిన డొమినిక్ తీమ్
రఫాల్ నడాల్‌,డొమినిత్ తీమ్ (Us Open Tennis/ Twitter)
  • Share this:
ఓ అరుదైన సమరానికి అమెరికన్ ఓపెన్‌ వేదికగా నిలిచింది.2018 యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్‌లో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్‌,ఆస్ట్రియన్ స్టార్ డొమినిక్ తీమ్‌‌కు మధ్య జరిగిన మ్యాచ్ టెన్నిస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఐదు సెట్లలో ఐదు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోటీ ప్రస్తుత అమెరికన్ ఓపెన్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది.ఆర్దర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన పోటీలో టాప్ సీడ్ నడాల్‌కు 9వ సీడ్ డొమినిక్ తీమ్ అడుగడుగునా గట్టి పోటీనిచ్చాడు.సెమీఫైనల్ బెర్త్ కోసం ఇద్దరూ పెద్ద యుద్దమే చేశారు.
ప్రస్తుత టోర్నీలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన డొమినిక్ తీమ్‌ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరచాడు. తొలి సెట్‌లో నడాల్‌కు అసలే మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగిఆడాడు.తీమ్ జోరు ముందు తేలిపోయిన నడాల్ ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయాడు. పోరు ఆరంభం నుంచే రాఫా తడబడ్డాడు.టాప్ సీడ్ నడాల్‌కు 9వ సీడ్ తీమ్ అడుగడుగునా గట్టి పోటీనిచ్చాడు. మొదటి సెట్‌లో డొమినిక్ తీమ్ అంచనాలకు మించి రాణించాడు.6-0తో తొలి సెట్‌ నెగ్గి నడాల్‌కు మాత్రమే కాదు స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌కు సైతం షాకిచ్చాడు.తొలి సెట్ షాక్ తర్వాత నడాల్ జోరు పెంచాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించి వరుసగా రెండు సెట్లు సొంతం చేసుకున్నాడు.

పవర్‌పుల్ షాట్లు,కళ్లు చెదిరే రిటర్న్స్‌తో చెలరేగాడు.6-4తో సెకండ్ సెట్, 7-5తో థర్డ్ సెట్ నెగ్గి పోటీలో నిలిచాడు.సులువుగా నాలుగో సెట్‌ నెగ్గుతాడనుకున్న నడాల్ టై బ్రేకర్‌లో విఫలమయ్యాడు.7-4 పాయింట్లతో టై బ్రేక్‌లో డామినేట్ చేసిన డొమినిక్ నాలుగో సెట్ నెగ్గి అభిమానులను అవాక్కయేలా చేశాడు.మ్యాచ్ నిర్ణయాత్మక 5వ సెట్‌లోనూ ఇద్దరి మధ్య పోటీ తారా స్థాయికి చేరుకుంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగడంతో ఐదో సెట్‌లో సైతం టై బ్రేక్‌ తప్పలేదు.ఈ సారి టై బ్రేకర్‌లో నడాల్ తన అనుభవాన్నంతా ఉపయోగించి సమయస్పూర్తితో ఆడాడు.చెమటోడ్చి నెగ్గి ఎట్టకేలకు విజేతగా నిలిచాడు.5 గంటల పాటు సాగిన సమరంలో చివరకు నడాల్‌నే విజయం వరించింది. నడాల్‌కు అడుగడుగునా గట్టి పోటీనిచ్చి..ఐదు గంటల పాటు పోరాడి ఓడిన డొమినిక్ తీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


ప్రస్తుత టోర్నీలో టైటిల్ ఫేవరెట్ ట్యాగ్‌లైన్‌తో పాటు టాప్ సీడ్ హోదాలో  మెన్స్ సింగిల్స్‌ చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన నడాల్‌‌కు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ఓ మేల్కొలుపు అనడంలో అనుమానమే లేదు.17 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన నడాల్‌కు ఇంటర్నేషనల్‌ టెన్నిస్ టోర్నీల్లో 5 సెట్ల మ్యాచ్‌లు కొత్తేమీ కాదు.వయసు పెరుగుతున్నా తనలో సత్తా ఏమాత్రం తగ్గట్లేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:


యూఎస్ ఓపెన్: సెమీస్‌లో సెరెనా విలియమ్స్


ఫెదరర్,షరపోవా ఔట్..కళ తప్పిన యూఎస్ ఓపెన్

Published by: Prasanth P
First published: September 5, 2018, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading