అమెరికన్ ఓపెన్‌లో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్‌కు ఎదురేలేకుండా పోతోంది.టైటిల్ ఫేవరెట్ ట్యాగ్‌లైన్‌తో పాటు టాప్ సీడ్ హోదాలో మెన్స్ సింగిల్స్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రఫాల్ నడాల్ అతికష్టంమీద సెమీఫైనల్ రౌండ్ చేరాడు.తొలి రౌండ్,రెండో రౌండ్ పోటీల్లో మాత్రమే సులువుగా విజయాలు సాధించిన స్పానిష్ బుల్ మూడో రౌండ్ నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం కోసం పెద్ద యుద్ధమే చేశాడు.ఆస్ట్రియన్ స్టార్ డొమినిక్ తీమ్తో జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోరు ఆరంభం నుంచే రాఫా తడబడ్డాడు.టాప్ సీడ్ నడాల్‌కు 9వ సీడ్ తీమ్ అడుగడుగునా గట్టి పోటీనిచ్చాడు.మొదటి సెట్లో డొమినిక్ తీమ్ అంచనాలకు మించి రాణించాడు.6-0తో తొలి సెట్ నెగ్గి నడాల్‌కు షాకిచ్చాడు.
తొలి సెట్ షాక్ నుంచి వెంటనే తేరుకున్న స్పానిష్ బుల్ సెకండ్ సెట్ నుంచి స్పీడ్ పెంచాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించి వరుసగా రెండు సెట్లు సొంతం చేసుకున్నాడు.6-4తో సెకండ్ సెట్,7-5తో థర్డ్ సెట్ నెగ్గి పోటీలో నిలిచాడు.నాలుగో సెట్లోనూ నడాల్ జోరు కొనసాగింది.డొమినిక్ గట్టి పోటీనివ్వడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది.టై బ్రేకర్‌లో నడాల్‌పై ఆధిపత్యం ప్రదర్శించి 7-4 పాయింట్లతో టై బ్రేక్‌లో నాలుగో సెట్ నెగ్గాడు.నిర్ణయాత్మక 5వ సెట్లోనూ ఇద్దరి మధ్య పోటీ తారా స్థాయికి చేరుకుంది.ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడటంతో మరో సారి టై బ్రేక్‌కు దారి తీసింది.నాల్గవ సెట్ టై బ్రేక్‌లో చేసిన పొరపాట్లు రిపీట్ చేయకుండా నడాల్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడాడు.టై బ్రేక్‌లో చెమటోడ్చి నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. 5 సెట్లలో అతికష్టంమీద నెగ్గి ఎట్టకేలకు టైటిల్ వేటలో నిలిచాడు.ఫైనల్ బెర్త్ కోసం సెమీస్‌లో అర్జెంటీనా స్టార్ జువాన్ మార్టిన్ డెల్ పోత్రోతో పోటీపడతాడు.
2017 అమెరికన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన నడాల్...మూడు సార్లు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాఫా ఇదే స్పీడ్ కొనసాగిస్తే నాల్గవ సారి ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ఖాయం.ప్రస్తుతం ఏటీపి వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ప్లేస్‌లో ఉన్న స్పానిష్ బుల్ ఈ టైటిల్ నెగ్గితే 18 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తాడు. ఇదే జరిగితే ఫెదరర్ తర్వాత మోడ్రన్ టెన్నిస్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మార్క్ దాటిన ఘనత నడాల్కే దక్కుతుంది.
RAFA PREVAILS!
In 4 hours and 49 minutes, @RafaelNadal defeats Thiem 0-6, 6-4, 7-5, 6-7, 7-6 at 2:04am!#USOpen pic.twitter.com/eHYr2rZy3Y
— US Open Tennis (@usopen) September 5, 2018
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tennis, US Open 2018