Aus Open 2019: సెమీస్ చేరి..ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న నడాల్

Aus Open 2019: సరిగ్గా పదేళ్ల క్రితం, 2009లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గాడు నడాల్. ఆ తర్వాత మూడు సార్లు ఫైనల్ చేరినా చాంపియన్‌గా నిలవలేకపోయాడు. ప్రస్తుత టోర్నీ క్వార్టర్‌ఫైనల్‌లో అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియాఫోయీపై వరుస సెట్లలో నెగ్గి సెమీస్ చేరి...ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.

news18-telugu
Updated: January 22, 2019, 6:30 PM IST
Aus Open 2019: సెమీస్ చేరి..ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న నడాల్
ఆస్ట్రేలియా ఓపెన్‌లో జోరు మీదున్న రఫాల్ నడాల్ (getty image)
  • Share this:
ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్‌కు పోటీనే లేకుండా పోయింది. సునాయాసంగా మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్‌లో ఎంటరయ్యాడు. క్వార్టర్‌ఫైనల్‌లో అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియాఫోయీపై వరుస సెట్లలో నెగ్గాడు. టైటిల్ ఫేవరెట్‌గా..రెండో సీడ్‌ హోదాలో బరిలోకి దిగిన నడాల్ దూకుడు ముందు అన్‌సీడెడ్ టియాఫోయీ తేలిపోయాడు. తొలి సెట్‌ నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. 6-3తో ఫస్ట్ సెట్ నెగ్గి శుభారంభం చేశాడు. సెకండ్ సెట్‌లోనూ స్పానిష్ బుల్ జోరు కొనసాగింది. ప్రత్యర్ధి నుండి పోటీ ఎదురైనా ఏ మాత్రం తడబడకుండా...6-4‌తో రెండో సెట్ నెగ్గి మ్యాచ్‌పై పట్టుబిగించాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో టియాఫోయీ కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేశాడు. 6-2తో ఆ సెట్ సైతం సొంతం చేసుకుని సెమీస్‌కు దూసుకెళ్లాడు.

సెమీస్‌లో అపార అనుభవజ్ఞుడైన స్పానిష్ బుల్..సెమీస్‌లో గ్రీస్‌కు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ స్టెఫానోస్ సిసిపాస్‌తో పోటీ పడనున్నాడు. దాంతో నడాల్‌కు ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమంటున్నారు విశ్లేషకులు. అంతలా అదరగొడుతున్నాడు రాఫా.





ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ సెమీఫైనల్ చేరడం నడాల్‌కు ఇది ఆరో సారి కావడం విశేషం. ఓవరాల్‌గా ఓ గ్రాండ్‌స్లామ్ సెమీస్ చేరడం ఇది 30వ సారి కావడం మరో విశేషం.

సరిగ్గా పదేళ్ల క్రితం, 2009లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గాడు నడాల్. ఆ తర్వాత మూడు సార్లు ఫైనల్ చేరినా చాంపియన్‌గా నిలవలేకపోయాడు. దాంతో ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని తహతహలాడుతున్నాడు.

First published: January 22, 2019, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading