T20 World Cup: మోకాలిపై నిలబడటం ఇష్టం లేక మ్యాచ్ నుంచి తప్పుకున్న క్వింటన్ డికాక్.. సర్వత్రా విమర్శలు

మ్యాచ్‌కు ముందు డికాక్ సంచలన నిర్ణయం.. కారణం అదే

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ప్రతీ మ్యాచ్‌కు ముందు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) ఉద్యమానికి మద్దతుగా ఆటగాళ్లు మోకాలిపై మద్దతుగా నిలుస్తున్నారు. అయితే వెస్టిండీస్‌‌తో మ్యాచ్‌కు ముందు క్వింటన్ డికాక్ అకస్మాత్తుగా తప్పుకున్నాడు. బీఎల్ఎంకు మద్దతు తెలపడం ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Share this:
    సౌత్ ఆఫ్రికా (South Africa) వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ (Quinton De Cock) ఆ జట్టుకు పెద్ద షాక్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భాగంగా వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న కీలక మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు అతడు వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. ఈ మ్యాచ్ తాను ఆడలేనని.. కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయని అతడు జట్టు యాజమాన్యానికి చెప్పడంతో అప్పటికప్పుడు అతడి స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. క్వింటన్ డి కాక్ తప్పుకోవడంతో అతడి స్థానంలో రీజా హెన్రిక్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా, మ్యాచ్‌కు ముందు అందరూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (BLM) (బీఎల్ఎం)కు మద్దతుగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) అందరూ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే బీడబ్ల్యూఎల్‌కు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న డికాక్.. అలా మోకాలిపై ఉండటం ఇష్టం లేకనే మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా ట్వీట్ చేయడం గమనార్హం.

    టాస్ వేయడానికి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బువామా ఈ విషయంపై మాట్లాడుతూ.. 'డికాక్ ఎలాంటి గాయాల బారిన పడలేదు. కానీ వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు' అని పేర్కొనడం గమనార్హం. కాగా, క్వింటన్ డి కాక్ ఎందుకు మ్యాచ్ నుంచి తప్పుకున్నాడో అతడు తెలుపలేదు.. మరోవైపు సీఎస్ఏ కూడా దీనిపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కాగా, బీఎల్ఎంకు మద్దతుగా మోకాలిపై నిల్చోవడం తప్పని సరి చేయడంతోనే డికాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

    IPL 2022: అక్షరాలా రూ. 12715 కోట్లు.. ఆ రెండు జట్లు లాభాల బాట పట్టేదెన్నడు? కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీలకు లాభాలు వస్తాయా?











    అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా బీఎల్ఎం ఉద్యమం ప్రారంభమైంది. ఐసీసీ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. తొలి సారిగా ఇంగ్లాండ్-వెస్టిండీస్ సిరీస్ జరిగిన సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇందుకు మద్దతుగా మోకాలిపై నిలబడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ప్రతీ మ్యాచ్‌కు ముందు బీఎల్ఎంకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.

    తాజాగా డికాక్ స్పందిస్తూ.. 'నా వ్యక్తిగత కారణాలు నాకు ఉన్నాయి. అవి నేను వెల్లడించాల్సిన అవసరం లేదు.' అని అన్నాడు.
    Published by:John Naveen Kora
    First published: