అమెరికా (USA)లో గత ఏడాది శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి కర్కశత్వానికి నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ బలైపోయాడు. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై పోలీసు అధికారి మోకాళ్లపై కూర్చుని అతడ్ని ఊపిరాడనీయకుండా చేసి చంపడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అగ్రరాజ్ంలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా బీఎల్ఎం ఉద్యమం ప్రారంభమైంది. ఐసీసీ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. తొలి సారిగా ఇంగ్లాండ్-వెస్టిండీస్ సిరీస్ జరిగిన సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇందుకు మద్దతుగా మోకాలిపై నిలబడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ప్రతీ మ్యాచ్‌కు ముందు బీఎల్ఎంకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. కానీ.. ఒక్క దక్షిణాఫ్రికా జట్టు విషయానికి వచ్చేసరికి మాత్రం ఇదొక వివాదంలా మారిపోయింది.
టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భాగంగా వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న కీలక మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. ఈ మ్యాచ్ తాను ఆడలేనని.. కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయని అతడు జట్టు యాజమాన్యానికి చెప్పడంతో అప్పటికప్పుడు అతడి స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. అయితే, మ్యాచ్‌కు ముందు అందరూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (BLM) (బీఎల్ఎం)కు మద్దతుగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) అందరూ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే బీడబ్ల్యూఎల్‌కు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న డికాక్.. అలా మోకాలిపై ఉండటం ఇష్టం లేకనే మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయ్. దీంతో క్వింటన్ డికాక్ పై చర్యలు తప్పవంటూ వార్తలు హల్చల్ చేశాయ్. అయితే, ప్రస్తుతం తన జట్టు సభ్యులకు సారీ చెప్పాడు. తన మోకాళ్లపై ఎందుకు నిలబడలేదో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు రెండు పేజీల లేఖ రాశాడు.
Quinton de Kock statement ? pic.twitter.com/Vtje9yUCO6
— Cricket South Africa (@OfficialCSA) October 28, 2021
" నేను రేసిస్ట్ (జాత్యాంహకారిని) ని కాదు. మోకాళ్ల నిలబడటం వల్ల ఎవరికైనా న్యాయం జరుగుతుందంటే అలా చేసేవాడిని. అలా నిలబడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దీని వల్ల ఇతరుల జీవితం మెరుగుపడటం, వారికి బెటర్ ఎడ్యుకేషన్ వస్తుందంటే నేను మోకాళ్లపై నిలబడటానికి వెనుకాడను. అప్పటికప్పుడు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మోకాళ్లపై నిలబడమని ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి వారి వ్యక్తిగత కారణాలు ఉంటాయ్. నా కుటుంబంలో నల్లజాతి మూలాలు ఉన్నాయ్. మా పినతల్లి బ్లాక్ కుటుంబానికి చెందినదే. మా అక్కాచెలెళ్లు ఇలా అందరూ హాఫ్ బ్లాక్- హాఫ్ వైట్ కి చెందినవారే. నేను ఎప్పుడూ జాతి వివక్ష చూపించాలని అనుకోలేదు. నా స్నేహితుల్లో కూడా నల్లజాతీయులు ఉన్నారు. ఏది ఏమైనా సరే.. నా చర్య వల్ల సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సభ్యులు బాధపడితే వారికి క్షమాపణలు " అంటూ డికాక్ లేఖలో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి చదవండి : విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్..!
ఈ లేఖను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. నిజానికి.. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఇలా వర్ణ వివక్ష వివాదం కొత్తమీ కాదు. 1970లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కేవలం శ్వేత జాతీయులు ప్రాతినిథ్యం వహించే జట్లతో మాత్రమే క్రికెట్ ఆడాలని నిర్ణయించింది. దీంతో, ఐసీసీ ఆ జట్టుపై దాదాపు రెండు దశాబ్దాలు వేటు వేసింది. 1991లో ఆ నిషేధం తొలగినా.. టీమ్‌లో నల్లజాతీయులకి తగిన ప్రాధాన్యం దక్కలేదనే విమర్శలు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, ICC, South Africa, T20 World Cup 2021, West Indies