BWF WorldTour: పీవీ సింధుపై ప్రముఖుల ప్రశంసల జల్లు

#BWFWorldTourFinals2018: బీడబ్ల్యూఎఫ్ ఫైనల్లో విజయం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

news18-telugu
Updated: December 16, 2018, 4:05 PM IST
BWF WorldTour: పీవీ సింధుపై ప్రముఖుల ప్రశంసల జల్లు
బీడబ్ల్యూఎఫ్ టైటిల్ సాధించిన పీవీ సింధు (AFP)
  • Share this:
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ కైవసం చేసుకున్న తెలుగుతేజం పీవీ సింధు మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. గత ఏడాది కూడా ఫైనల్స్ వరకు వెళ్లి ఓడిన సింధు, ఈ సారి ఫైనల్స్ ఫీవర్‌ను దాటి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ ఒకుహారను 21-19, 21-17 తేడాతో ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది. దీంతో మన బ్యాడ్మింటన్ స్టార్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖులు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సింధుకు జేజేలు పలుకుతున్నారు.

ఈ ఏడాదిని విజయంతో ముగిసించిన పీవీ సింధును రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అభినందించారు. 2019లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.



క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా సింధును అభినందిస్తూ ట్వీట్ చేశారు. బీడబ్ల్యూఎఫ్ టైటిల్ సాధించిన సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.

దేశం గర్వపడే విజయం సాధించిన పీవీ సింధుకు అభినందనలు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.


పీవీ సింధు సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంటూ ట్వీట్ చేశారు.


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సింధును పొగడ్తల్లో ముంచేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: December 16, 2018, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading