హోమ్ /వార్తలు /క్రీడలు /

PV Sindhu: మారని జనాలు.. పతకం గెలిచిన పీవీ సింధు గురించి గూగుల్‌లో ఏం వెతికారో తెలుసా..?

PV Sindhu: మారని జనాలు.. పతకం గెలిచిన పీవీ సింధు గురించి గూగుల్‌లో ఏం వెతికారో తెలుసా..?

పీవీ సింధు(Image-Instagram/Sindhu Pv)

పీవీ సింధు(Image-Instagram/Sindhu Pv)

టెక్నాలజీ అభివృద్ధి చెంది దేశం ఎంత ముందుకు వెళ్తున్నా సరే, భారతీయుల ఆలోచనా విధానం మాత్రం మారడం లేదు. ఇంకా పాత కాలపు ఆలోచనల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు.

టెక్నాలజీ అభివృద్ధి చెంది దేశం ఎంత ముందుకు వెళ్తున్నా సరే, భారతీయుల ఆలోచనా విధానం మాత్రం మారడం లేదు. ఇంకా పాత కాలపు ఆలోచనల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం గెలిచిన తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu) గురించి భారత నెటిజన్లు ఏ ఏ విషయాలు వెతికారో తెలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఒలింపిక్ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్​గా సింధును ప్రశంసించాల్సింది పోయి ఆమెది ఏ కులమో తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు ఆసక్తి కనబర్చారు. గతంలో జరిగిన రియో ఒలింపిక్స్​లో ఆమె రజతం నెగ్గగా.. అప్పటి విజయాలపై కాకుండా కులంపై ఎక్కువ మంది సెర్చ్​ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కంటే ఇప్పుడు 700% మంది ఎక్కువగా సింధు కులం గురించి గూగుల్‌లో వెతకడం గమనార్హం.

నెటిజన్లలో చాలా మంది పివి సింధు కులం ఏంటి? ఆమె కమ్మ కులానికి చెందినదా? అనే ప్రశ్నలను సెర్చ్​ చేశారు. గూగుల్ సెర్చ్​ బాక్స్​లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం మోస్ట్​ సెర్చ్‌డ్​ కీవర్డ్​గా ఉందని గుర్తించారు. పీవీ సింధు కులం గురించి వెతికిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత హర్యానా, పుదుచ్చేరి, ఢిల్లీకి చెందిన నెటిజన్లు సింధు కులం గురించి వెతికారు.

గతంలో హిమాదాస్​ కులంపైనా..

పాపులర్​ సెలబ్రెటీలు, ఏదైనా ఘనత సాధించిన వారి కులాలను సెర్చ్​ చేయడం ఇది మొదటిసారేం కాదు. IAAF ప్రపంచ U-20 ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్ హిమా దాస్ కులం గురించి కూడా అప్పట్లో చాలా మంది వెతికారు. అప్పట్లో ఈ ప్రశ్న గూగుల్​ సెర్చ్​లో మోస్ట్​ ట్రెండింగ్​గా నిలిచింది. భారతదేశంలో కుల వ్యవస్థను 1948లో అధికారికంగా రద్దు చేశారు. కులం ఆధారంగా ఇతరులపై వివక్ష చూపించడంపై రాజ్యాంగం నిషేధం విధించింది. అయినప్పటికీ, ఇంకా ఈ కుల వ్యవస్థ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. విద్యా వంతులు సైతం గూగుల్​లో వ్యక్తుల కులాలను వెతికే ధోరణి పెరిగిందంటే దేశ పౌరుల్లో కులం అనే భావన ఎంత బలంగా నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Google search, Pv sindhu, Tokyo Olympics

ఉత్తమ కథలు