టోక్యో ఒలింపిక్స్ 2020 : పీవీ సింధుకు సవాల్ విసురుతున్న కరోలినా మారిన్

PV Sindhu : 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌తో సరిపెట్టుకున్న పీవీ సింధు... వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో ఛాంపియన్ అయ్యేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. కానీ... మోకాలి చిప్ప గాయం నుంచీ కోలుకున్న కరోలినా మారిన్... ఇటీవలే చైనా ఓపెన్ టైటిల్ గెలిచి... దూకుడు మీద ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 1:15 PM IST
టోక్యో ఒలింపిక్స్ 2020 : పీవీ సింధుకు సవాల్ విసురుతున్న కరోలినా మారిన్
కరోలినా మారిన్, పీవీ సింధు (File)
Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 1:15 PM IST
Tokyo Olympics 2020 : స్పెయిన్‌కి చెందిన 26 ఏళ్ల ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ఎనిమిది నెలల కిందట ఆమె కుడి మోకాలు చిప్ప చీలిపోయింది. సర్జరీ జరిగింది. దాంతో ఇక ఆమె బ్యాడ్మింటన్ ఆడలేదని అంతా అనుకున్నారు. అలాంటిది... ఆమె అత్యంత వేగంగా రికవరీ అయ్యింది. మళ్లీ బాడ్మింటన్ కోర్టుల్లో వేగంగా కదులుతూ ఆశ్చర్యపరుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండో టోర్నమెంట్ అయిన చైనా ఓపెన్‌లో ఆమె... ఐదు రౌండ్లు విజయవంతంగా పూర్తి చేసి... టైటిల్ సాధించింది. ముఖ్యంగా టైటిల్ పోరులో... చైనాకి చెందిన ప్రపంచ నెంబర్ వన్ తాయ్ జు యింగ్‌పై ఆడపులిలా చెలరేగిపోయింది. గాయం కారణంగా ఆమె ర్యాంకింగ్... 26వ సీడ్ పొజిషన్‌కి పడిపోయినా... ఇప్పుడు ప్రపంచ బెస్ట్ ప్లేయర్లకు మారిన్ సవాల్ విసురుతోంది.

మారిన్ విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె వీడియోలను జోరుగా షేర్ చేస్తున్నారు. ఐతే... ఇది ఇటీవల వరల్డ్ ఛాంపియన్ అయిన పీవీ సింధుకు ఇబ్బంది కలిగించేదే. 2016 రియో ఒలింపిక్స్‌లో గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్న సింధు... సిల్వర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి జపాన్ రాజధాని టోక్యోలో 2020లో జరిగే ఒలింపిక్స్‌లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

24 ఏళ్ల సింధూకి ఎదురవుతున్న సమస్యేంటంటే... స్పెయిన్ అమ్మాయి అసాధారణ ప్రతిభ చూపిస్తోంది. ఆమె... 2014, 2015, 2018లో మూడు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గెలుచుకుంది. 2016లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా ఆమెనే వరించింది. అందువల్ల మారిన్‌ను ఎదుర్కోవడం పీవీ సింధుకు బిగ్గెస్ట్ హర్డిల్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

దీనిపై స్పందించిన సింధూ కోచ్ పుల్లెల గోపీచంద్... టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ కచ్చితంగా బలమైన ప్లేయర్‌గా నిలుస్తుందని అన్నారు. ఆమెకు కచ్చితంగా పోటీ ఉంటుందన్న ఆయన... ఇంకా ఏడాది టైమ్ ఉన్నందున... మారిన్‌ను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. సింధూ సరికొత్త ఆయుధాలతో రంగంలోకి దిగాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...