ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవి సింధు జోరు కొనసాగుతోంది. తొలి రౌండ్లో వియత్నాం అన్‌సీడెడ్ క్రీడాకారిణి వూ ట్రాంగ్పై మూడు సెట్లలో పోరాడి నెగ్గిన సింధు..ప్రీ క్వార్టర్ఫైనల్లో మాత్రం రెండు సెట్లలోనే సునాయాస విజయం నమోదు చేసింది. 3వ సీడ్‌గా బరిలోకి దిగిన సింధు ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేసియా రైజింగ్ స్టార్ గ్రిగోరియా మరిస్కా టంజంగ్పై బ్యాక్ టు బ్యాక్ సెట్లలో నెగ్గింది. 34 నిమిషాల పాటు సాగిన ప్రీక్వార్టర్‌ఫైనల్ పోరులో సింధు స్థాయికి తగ్గట్టుగా రాణించింది. తొలి సెట్‌ను 14 నిమిషాల్లోనే సులువుగా నెగ్గి శుభారంభం చేసింది.
ఫస్ట్ సెట్లో 12 పాయింట్లు సర్వీస్‌లోనే సాధించి ప్రత్యర్ధిపై ఒత్తిడి తెచ్చింది. 21-12తో తొలి సెట్ సొంతం చేసుకున్న సింధుకు సెకండ్ సెట్లో మాత్రం టంజంగ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆధిపత్యం కోసం కొద్దిసేపు ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. కీలక సమయాల్లో తనదైలి శైలిలోనే సింధు ఎదురుదాడికి దిగింది. 20 నిమిషాల పాటు సాగిన సెకండ్ సెట్‌ను 21-15తో నెగ్గి విజేతగా నిలిచింది. రెండో సెట్లోనూ కేవలం సర్వీస్‌లోనే సింధు 13 పాయింట్లు సాధించడం విశేషం.ఈ విజయంతో క్వార్టర్స్ చేరిన సింధు ఏషియాడ్ ఉమెన్స్ సింగిల్స్‌లో పతకం నెగ్గాలని పట్టుదలతో ఉంది.
2018 బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకున్న సింధు..ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. 2014 ఇంచియాన్ గేమ్స్‌లో పతకం నెగ్గలేకపోయిన సింధు..ప్రస్తుత ఏషియాడ్‌లో బంగారు పతకం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.క్వార్టర్‌ఫైనల్ దాటి సెమీస్ చేరితే భారత బ్యాడ్మింటన్ స్టార్‌కు ఏషియాడ్ పతకం ఖాయమవుతుంది.
అటు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో మరో భారత ఆశాకిరణం సైనా నెహ్వాల్ కూడా క్వార్టర్స్‌కు చేరింది.
ఇవి చదవండి :
ఏషియాడ్: క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్