సానియా మీర్జాకు సవాల్ విసిరిన పివి సింధు..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో ప్రముఖ భారత బాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పాల్గొన్నారు.

news18-telugu
Updated: November 2, 2019, 1:37 PM IST
సానియా మీర్జాకు సవాల్ విసిరిన పివి సింధు..
Twitter
  • Share this:
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో ప్రముఖ భారత బాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పాల్గొన్నారు. అందులో భాగంగా ఆమె గోపిచంద్ అకాడమిలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ...హరితహారం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పర్యావరణం రాను రాను క్షీణిస్తోందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు. కాగా ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆమె మూడు మొక్కలు నాటిన సింధూ.. మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. వారిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఉన్నారు.


గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న బాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు..


ప్రియాంక హాట్ పిక్స్
First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>