Home /News /sports /

PV SINDHU LATEST NEWS INDIAN STAR BADMINTON PLAYER PV SINDU WIN SWISS OPEN WOMEN TITLE SJN

PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధు సంచలనం... ప్రతిష్టాత్మక చాంపియన్ షిప్ టైటిల్ కైవసం

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

PV Sindhu: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) సంచలన ప్రదర్శన చేసింది. గత కొంత కాలంగా ఆటలో పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆమె... తాజాగా తన ఆటతో విమర్శకులకు బదులిచ్చింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (All England open) లో కనీసం సెమీఫైనల్స్ కూడా చేరని ఆమె ఫామ్ పై అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి

ఇంకా చదవండి ...
PV Sindhu: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) సంచలన ప్రదర్శన చేసింది. గత కొంత కాలంగా ఆటలో పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆమె... తాజాగా తన ఆటతో విమర్శకులకు బదులిచ్చింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (All England open) లో కనీసం సెమీఫైనల్స్ కూడా చేరని ఆమె ఫామ్ పై అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ (Olympics) లో కాంస్య పతకంతో మెరిసిన ఆమె... భారత్ వేదికగా జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీలో  మాత్రమే విజేతగా నిలిచింది. ఇక మిగతా టోర్నీల్లో తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. అయితే స్విస్ ఓపెన్ లో ఆమె తన ఆటతీరుతో అదరగొట్టింది.

ఆదివారం 49 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో సింధు 21-16, 21-8 తేడాతో థాయ్ లాండ్ షట్లర్ బుసానెన్ పై వరుస గేముల్లో గెలుపొందింది. ఆట ఆరంభం నుంచే పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన పీవీ సింధు వరుస పాయింట్లతో అదరగొట్టింది. ప్రత్యర్థిని కోర్టు నలువైపులా పరుగెత్తిస్తూ అలసిపోయేలా చేసింది. సుదీర్ఘ ర్యాలీలతో పాటు వీలు చిక్కినప్పుడల్లా స్మాష్ షాట్లతో బుసానెన్ చేత బుసలు కొట్టించింది. ఈ క్రమంలో తొలి గేమ్ కోసం కాస్త శ్రమించిన సింధు... రెండో గేమ్ లో మాత్రం రెచ్చిపోయింది. ప్రత్యర్థికి  ఎటువంటి అవకాశం ఇవ్వకుండా గేమ్ ను గెలిచి మ్యాచ్ ను ముగించింది.



పురుషుల సింగిల్స్ లో మాత్రం భారత్ కు నిరాశ ఎదురైంది. అంచనాలకు మించి రాణించి ఫైనల్ చేరిన తెలుగు కుర్రాడు ప్రణయ్ తుది మెట్టుపై బోల్తా పడ్డాడు. 48 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ల ోప్రణయ్ 12-21, 18-21తో జొనాథన్ క్రీస్టీ (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు. తొలి గేమ్ లో అనవసరపు తప్పిదాలను ఎక్కువగా చేసిన ప్రణయ్ తొలి గేమ్ లో తొందరగానే కోల్పోయాడు. అయితే రెండో గేమ్ లో పుంజుకున్న అతడు ప్రత్యర్థికి టఫ్ ఫైట్ ఇచ్చాడు.



ఈ క్రమంలో అతడు గేమ్ ను గెలిచేలా కనిపించాడు. అయితే టోర్నీ నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ ఒత్తిడిని అధిగమించి కీలక సమయాల్లో పాయింట్లను సాధంచి గేమ్ తో పాటు మ్యాచ్ ను నెగ్గి చాంపియన్ గా నిలిచాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Badminton, India, Olympics, Pv sindhu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు