హోమ్ /వార్తలు /క్రీడలు /

PV Sindhu: ఆటలోనే కాదు డ్యాన్స్ లోనూ పీవీ సింధు మెరుపులు.. చీరకట్టులో తెలుగమ్మాయి స్టెప్పులు అదుర్స్!

PV Sindhu: ఆటలోనే కాదు డ్యాన్స్ లోనూ పీవీ సింధు మెరుపులు.. చీరకట్టులో తెలుగమ్మాయి స్టెప్పులు అదుర్స్!

PC : PV Sindhu Instagram

PC : PV Sindhu Instagram

PV Sindhu: వరల్డ్ స్పోర్ట్స్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సెలబ్రిటీ పీవీ సింధు ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి, ఆమె అభిమానులకు హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వరల్డ్ స్పోర్ట్స్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సెలబ్రిటీ పీవీ సింధు (PV Sindhu) ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి, ఆమె అభిమానులకు హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. సినిమా స్టార్స్‌కి ఏమాత్రం తీసిపోనంటూ సింధు వరుస ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో అలరిస్తుంది. క్రీడాభిమానులను తన విజయాలు, పతకాలతో ఖుషీ చేస్తున్న బ్యాడ్మింటెన్ స్టార్ తనలో వేరే యాంగిల్ కూడా ఉందని తన లేటెస్ట్‌ వీడియోల ద్వారా చూపించాలని ట్రై చేస్తోంది. పీవీ సింధు ఒలింపిక్స్‌లో వరుస పతకాలు సాధించి ఇండియాకే కాదు తెలుగు వాళ్ల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. స్పోర్ట్స్‌ స్టార్‌తో వచ్చిన క్రేజ్ సరిపోలేదనుకుంటా సింధుకు అందుకే సోషల్ మీడియాలో స్టార్‌ యాక్టరస్‌ తరహాలో తన అప్‌డేట్స్‌ షేర్ చేసుకుంటోంది.

లేటెస్ట్ గా ఆమె డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. చక్కటి చీరకట్టులో ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆమె హావభావాలకు అందరూ అచ్చెరువొందుతున్నారు. మళయాళీ సినిమా కుమారి లోని ఓ పాటకు తన కాలు కదిపింది సింధు. ప్రస్తుతం ఈ వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఒక అభిమాని అయితే.. తెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగు వాళ్ల గుండెల్లో నిలిచే వెలుగమ్మాయి అంటూ పాటతో కూడిన కామెంట్స్ పోస్ట్ చేశాడు.

View this post on Instagram

A post shared by Sindhu Pv (@pvsindhu1)

షటిల్ బ్యాట్‌తో కోర్టులో ప్రత్యర్ధికి చెమటలు పట్టించే పీవీ సింధు హ్యాపీ మూడ్‌లో హిట్ సాంగ్‌కి స్టెప్పులు కూడా చేస్తుంది. గతంలో కచ్చా బాదమ్ , అరబిక్ కుతు సాంగ్‌ జిగిల్ జిగిల్ అనే హిట్‌ సాంగ్‌లకు స్టెప్పులు వేసింది. ఆ మధ్య గుజరాత్ లో జరిగిన నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న సింధు గుజరాతీ వస్త్రాదారణలో మెరిసింది. అక్కడి ప్రజలతో కలిసి డ్యాన్స్ చేసింది. పీవీ సింధు డ్యాన్స్‌లు, ఫోటోషూట్‌లు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని తన ధ్యాసంతా ఆటపైనే ఉందంటూ ఆ వార్తలను కొట్టి పారేసింది.

అయితే సినిమా స్టార్లతో సింధుకు చాలా క్లోజ్ రిలేషన్ మెయిన్‌టెన్ చేస్తూ వస్తోంది. చిరంజీవి , నాగార్జున, ప్రభాస్ , మంచు విష్ణు అలా అందరు హీరోలతో సన్నిహితంగా ఉంటారు సింధు. టాలీవుడ్‌లో హీరోలందరు ఇష్టమేనన్న సింధు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టమని ఓ టీవీ షోలో చెప్పారు. అదే షోలో సినిమాల్లో నటిస్తారా అనే ప్రశ్నకు బదులిచ్చిన సింధు తన జీవితంపై వచ్చే బయోపిక్ లో నటించే అవకాశం ఉందని చెప్పడం చూస్తుంటే వెండితెరపై తనను తాను చూసుకోవాలనే కోరిక ఉన్నట్లుగా అర్ధమవుతోంది.

ఇది కూడా చదవండి : త్వరలో ఆస్ట్రేలియాతో కీలక టెస్ట్ సిరీస్.. పంత్‌ స్థానాన్ని భర్తీ చేసేది ఈ ముగ్గురే.. లిస్టులో తెలుగు బిడ్డ!

భారత బ్యాడ్మింటెన్ స్టార్ పీవీ సింధు స్పోర్ట్స్‌లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అంతకు రెట్టింపు క్రేజ్ సొంతం చేసుకున్నారు. 3.5 మిలియన్స్ ఫాలోవర్స్‌ ఉన్నారు. రీసెంట్‌గా సింధు షేర్ చేసిన డ్యాన్స్ వీడియోకి కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

First published:

Tags: Badminton, Cricket, Pv sindhu, Sports

ఉత్తమ కథలు